Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఇప్పుడు స్మార్ట్ఫోన్లే. సరదా అనుకుని పిల్లల చేతికిస్తే గేమ్‌లు, చాటింగ్ లంటూ దానికే అతుక్కుపోతారు. ఇలాంట ప్పుడు ఆలస్యం చేయకుండా అమ్మగా వారి ప్రవర్తనపై ఓ కన్నేయడం మంచిదంటు న్నారు మానసిక నిపుణులు
ు పిల్లలు సెల్‌ని, కంప్యూటర్ని ఆపరేట్ చేస్తుంటే ఎంతో మురిసిపోతుంటారు కొందరు తల్లిదండ్రులు. అయితే వాళ్లు ఏ విషయాలపై అవగాహన పెంచుకుంటు న్నారు. ఏం చూస్తున్నారు అనే విషయాన్ని గమనించారా? లేదంటే మీ ఆలోచన తప్పే. మీ నియంత్రణ లేకపోతే పక్కదారి పట్టే ప్రమాదం లేకపోలేదు.
- కొన్ని సైట్లపై స్వీయ నియంత్రణ విధించు కోవడం తప్పనిసరి. అశ్లీలత, అసభ్యత ఎక్కువగా ఉన్నవాటిని మీ కంప్యూటర్లో తెరుచుకోకుండా సెట్టింగ్స్ ఏర్పాటు చేయండి. చదువుకుంటాం, తెలుసుకుంటాం అంటే మీరుసాయం చేస్తానని చెబుతూ వారికి అవసరమైనవి అందించండి. దీని వల్ల పరిస్థితిలో కొంత మార్పు రావొచ్చు.
- ప్రీటీనేజీ, టీనేజీ పిల్లలు ఎంతో మందికి ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో ఖాతాలు ఉన్నాయని చెబుతున్నాయి పలు నివేదికలు. కొందరు చిన్నారులు ఆకతాయిగా మారు పేర్లతో ఖాతాలు నిర్వహిస్తున్నారట. మీ పిల్లాడు ఏం చేస్తున్నాడో తెలియాలంటే ముందు తన ఖాతాలోనే కాదు.. తన స్నేహి తుల ఫేస్బుక్ ఖాతాలతోనూ అనుసంధానం కండి. అప్పుడే వారిపై ఓ కన్నేసి ఉంచొచ్చు.