Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడూ సమస్యలు, ఆందోళన అని బాధపడటం వల్ల ఒత్తిడి పెరుగుతుంటుంది. అది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకేవాటిని అధిగమించి ఆనందంగా ఉండటం ఎలా అని ఆలోచన చేయాలి.
- రోజులో మధ్య మధ్య నట్స్ తినడం ఓ అలవాటుగా మార్చుకోండి. అవి సెరటోనిన్ని విడుదల చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. సెరటోనిన్ ఒత్తిడిని తగ్గించి ఆనందంగా ఉండేందుకు తోడ్పడుతుది. గుండెకు మేలు చేస్తుంది. కాబట్టి బాదం, వాల్నట్ల వంటివిరోజులో గుప్పెడు తినేలా చూసుకోండి.
- డీహైడ్రేషన్ ఎదురైనా కూడా అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అవసరానికి మించి ఎక్కువగా నీళ్లు తాగేవారిలో ఒత్తిడి ప్రభావం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు అలసట, చికాకు తగ్గి రోజంతా చురుగ్గా కూడా ఉంటారట.
- కాస్త చికాగ్గా అనిపిస్తోందా.. ఏం చేయాలో తోచడం లేదా... ఇది కూడా ఒత్తిడికి సంకేతమే! అలాంటప్పుడు మీ స్నేహితులకు ఓ ఈమెయిల్ పంపండి. హారు చెబుతూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి. దానివల్ల అలసిన మనసుకు కాస్త ఊరటగా ఉంటుంది.
- ఒత్తిడిగా అనిపించినప్పుడు హాయిగా కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని కనీసం రెండు నిమిషాలైనా విశ్రాంతి తీసుకోండని చెబుతున్నారు అధ్యయన కర్తలు. అలా కూర్చోవడాన్ని పవర్ఫుల్ పోజ్ అంటారు. దానివల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిజాల్ స్థాయులు ఇరవై అయిదు శాతం తగ్గుతాయంటున్నారు నిపుణులు.
- పాత ఫోటోలు చూస్తూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకున్నప్పుడు మానసిక ఆనందం పదకొండు శాతం పెరుగుతుందట. ఇష్టమైన పాత ఫోటోలు చూడటం వల్ల ఇరవైరెండు శాతం విశ్రాంతి అందుతుందట. దీంతో కొత్త ఉత్సాహం సొంతమవుతుంది.