Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లం రసం రోజూ తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 లాంటి ఎన్నో పోషకాలుండే అల్లం రసం రోజూ తాగితే వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
కావలసినవి: అల్లం - 100గ్రా
నిమ్మరసం - 4 టే.స్పూన్లు
పంచదార - 100గ్రా
నీళ్లు - లీటరు
తయారీ విధానం: బ్లెండర్లో అల్లం ముక్కలు వేసి రసం తీసుకోవాలి. నీళ్లలో చక్కెర వేసి కలిపి, అందులో అల్లం రసం వేసి బాగా కలపాలి. చివర్లో నిమ్మరసం వేసి కలపాలి. గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్స్ వేసుకుని తాగేయాలి.