Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కురులు నిగనిగలాడుతూ అందంగా కనిపించాలంటే సరైన పోషణ అవసరం. శిరోజాల ఆరోగ్యాన్ని పెంపొందించే ప్యాక్స్ గురించి
- రెండు టేబుల స్పూన్ల ఆలివ్ ఆయిల్ అంతే మొత్తం కొబ్బరి నూనెలో గుడ్డుసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. మిశ్రమం వెంట్రుకలకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. కుదుళ్లు బలంగా అవుతాయి. దీంతో వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది.
- గుడ్డు సొన, పెరుగు, ఆవనూనె కలిపి తలకు పట్టించాలి. గుడ్డులోని బి-12, డి, ఇ విటమిన్లు, ఫ్యాటీ ఆసిడ్, ప్రోటీన్లు కుదుళ్లను బలంగా మార్చుతాయి. ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడుతాయి.
- అవకాడో గుజ్జులో నాలుగైదు చుక్కలు పెప్పర్మింట్ ఆయిల్ కలిపి జుట్టుకు మాస్క్ వేయాలి. 15-20 నిమిషాల తరువాత శుభ్రపరచుకోవాలి. వీటిలోని అధిక ప్రోటీన్లు, మాంసకృత్తులు తలకట్టు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి.
-వెంట్రుకలు చిట్లడం, చుండ్రు సమస్యలు ఉంటే జుట్టు రాలడం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ సమస్య నివారణకు కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రిపూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.
- ఆలివ్ ఆయిల్, దాల్చిన చెక్కపొడి, తేనె కలిపి మాడుకు పట్టించి 15 నిమిషాల తరువాత శుభ్రపరచుకోవాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.