Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంటింట్లో గరిటె తిప్పడం అమ్మాయిల పని, బండి నడపడం అబ్బాయిల హక్కు అన్న విధంగా మన పెద్దవాళ్ల మాటలు, ఆలోచనలు ఉంటాయి. ఇలాంటివి లింగవివక్షను చెప్పకనే చెబుతాయి. అమ్మాయిలు గరిటె తిప్పడమే కాదు గేర్ బైక్‌లు నడపగలరు అంటూ నిరూపిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళా రైడర్స్. మన రాష్ట్రంలో కేవలం రైడ్‌కే పరిమితం కాకుండా అడ్వెంచర్స్చేస్తూ రాష్ట్రస్థాయి అవార్డు కూడా అందుకున్నారు ట్రావెలర్, రన్నర్, గో యునెస్కో విన్నర్ జయ భారతి. టూవీలర్ ట్రైనింగ్ ద్వారా అమ్మాయిల్లో ఆత్మావిశ్వాసంతో పాటు సెఫ్టీ, ఎంపవర్ సాధ్యమంటున్నారు. జెస్ట్ రైడ్ అంటూ ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిమేల్ రైడర్స్ డే సందర్భంగా మస్ట్ రైడ్ అంటూ మహిళల్లో ఉత్సాహం నింపుతున్నారు. అమ్మాయిలకు ప్రొఫెషనల్‌గా డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఆమె చెప్పిన విశేషాలు..
ఒకరితో ప్రారంభమై..
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ముఖ్యరోజులు ఉన్నట్లే ఫిమేల్ రైడర్స్‌కు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఆలోచనతో కెనడాలో 2007లో విక్సి గ్రే ఇంటర్నేషనల్ ఫిమేల్ బైక్ రైడర్స్ డే ప్రారంభించారు. ప్రతి ఏడాది మేనెల మొదటి శనివారం ఇది నిర్వహిస్తారు. ఆ రోజు టూవీలర్ నడిపే మహిళలు తమకు తోచిన చిన్న రైడ్స్ చేస్తుంటారు. రైడింగ్ ప్యాషన్‌తో ఉన్న నేను, మరో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి బైక్ రైడ్స్ చేస్తున్నాం. మరికొంత మంది బైక్ రైడర్స్ గురించి సెర్చ్ చేస్తుంటే ఫూనెలో బైక్ రైడర్స్ గ్రూప్ స్టార్ట్ చేశారని, జాతీయ స్థాయిలో ఫీమేల్ రైడర్స్ గ్రూప్ ఉందని తెలిసింది. అదే సమయంలో ఇంటర్నేషనల్ ఫిమేల్ రైడ్ డే గురించి తెలిసింది. 2013లో మా ఫస్ట్ రైడ్ ఉందని ఫేస్బుక్లో పోస్టు చేశాం. దాంతో ఆసక్తి ఉన్న నలుగురైదుగురు అమ్మాయిలు ముందుకు వచ్చారు. అలా కొంతమంది రైడర్స్‌తో ఫస్ట్ ఫిమేల్ రైడ్ హైదరాబాద్‌లో చేశాం. ఉమెన్ రైడర్స్ సంఖ్య పెంచాలని లాంగ్ రైడ్స్, షీ టీమ్స్ రైడ్స్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఫిమేల్ రైడర్స్ డే, ఉమెన్ అవేర్నెస్ రైడ్, షీటీమ్స్ ప్రమోట్ చేస్తూ చాలా రైడ్స్ చేశాం.
2015లో దమన్‌లో జాతీయ స్థాయిలో ఫీమేల్ రైడర్స్ డే నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వందకు పైగా రైడర్స్ వచ్చారు. హైదరాబాద్ నుంచి నేను, మరో ఇద్దరు రైడర్స్ వెళ్లాం. ముంబయి నుంచి దమన్ వరకు రైడ్ చేశాం. వారందరినీ చూసి మాకు ఎంతో ఉత్సాహం వచ్చింది. హైరదాబాద్‌లో మహిళా రైడర్స్ సంఖ్య పెంచాలని ఎన్నో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం. లాంగ్ రైడ్స్ చేస్తూ అడ్వెంచర్ రైడ్స్ కూడా చేశాం. దేశంలోనే అతి ఎతైయిన రోడ్డు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని లదఖ్ ప్రాంతంలోని ఖార్ దుంగ్ పాస్. ప్రతికూల పరిస్థితుల మధ్య ఉండే ఘాట్‌రోడ్ ఇది. ఇక్కడ రైడ్ కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో ఫీమేల్ రైడర్స్ గ్రూప్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 2017లో ఇంటర్నేషనల్ ఫీమేల్ రైడర్స్ డే ఐదో వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో రెండు రోజుల వర్క్‌షాప్‌గా నిర్వహించాం. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 70మంది రైడర్స్, ఖతారు నుంచి ఒక రైడర్ వచ్చారు. మన టూరిజాన్ని పరిచయం చేస్తూ
వారి కోసం తారామతి బారాదరిలో ప్రోగ్రామ్స్ నిర్వహించాం. 'హైదరాబాద్ సేఫ్ ఫర్ ఉమెన్ 24 బై 7' అన్న కాన్సెఫ్ట్‌తో నెక్లెస్ రోడ్ నుంచి చార్మినార్ వరకు ఫీమేల్ రైడర్స్‌తో షీ టీమ్స్ పై అవగాహన కల్పిస్తూ.. మిడ్ నైట్ రైడ్ చేశాం. షీ టీమ్ అడిషనల్ కమిషనర్ స్వాతిలక్రా మేడమ్ మా రైడ్ స్టార్ట్ చేశారు. ఈ మొత్తం ప్రోగ్రామ్ ఒక బెంచ్ మార్క్‌గా నిలిచిపోయింది. ఇప్పటివరకు మళ్లీ ఇంత పెద్ద స్థాయిలో జరగలేదు.
వేలాది మంది..
గ్లోబల్ వైడ్‌గా ఈబైక్ రైడ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఫిమేల్ రైడర్స్ మధ్య పరిచయాలు పెరగడానికి, వారిలో అడ్వెంచర్ థింగ్స్ చేయడానికి ఇవి ఉపయోగపడుతాయి. రైడ్ చేసే ప్రతిఒకరు తన రైడ్లను సోషల్‌మీడియాలో 'ఐఎఫ్ఆర్డే'కు టాగ్ చేస్తే ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్న విషయం స్పష్టమవు తుంది. మన సిటీలోకూడా మహిళా రైడర్స్ సంఖ్య పెంచాలని ఎన్నో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం. అవేర్నెస్ రైడ్స్‌తో పాటు లాంగ్ రైడ్స్ కూడా చేశాం. దేశంలోనే అతి ఎతైయిన రోడ్డు ఖార్ దుంగ్ పాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్ ప్రాంతంలో పూర్తిగా ఘాట్‌రోడ్‌పై చేసిన రైడింగ్ అత్యంత సాహసోపేతం.
క్షేత్రస్థాయిలో
సాధికారత అంతే సరైన అర్థం తామెంచుకున్న రంగంలో స్వయంగా ఎదగడం. తమకు తాము ఇతరులపై ఆధారపడకుండా అన్ని పనులుచేసుకోవడం అని మా అభిప్రాయం. ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నారు. అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్‌గా శాటిలైట్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నారు. అయినా క్షేత్రస్థాయిలో ఆడపిల్లలకు బండ్లు ఎందుకు అంటూ విమర్శిస్తున్నారు. సైకిల్, బైక్ నడపడం అనేది వారుచేసే పనులను సరళతరం చేయడానికే కాదు. వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సరదాగా, ప్యాషన్‌గా ప్రారంభమైన రైడింగ్ వేలాది కిలోమీటర్ల ట్రావెలింగ్ చేయడానికి కారణమైంది. ఎలాంటి అడ్డంకులు, ఒడిదుడుకులు లేకుండా 56రోజుల పాటు మేం బైక్ రైడింగ్ చేయగలిగాం అంటే అది కేవలం రైడ్ చేయడం వల్ల మాలో పెరిగిన కాన్ఫిడెన్స్. ఇంటి పనులకే పరిమితమైన మహిళలు నేడు మగవారితో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నా మోటార్ వాహనాలు నడపడంతో మాత్రం కాస్త వెనుకబడేఉన్నారు. వారికి సరైన విధానంలో బండి నడపడం నేర్పిస్తే ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు.
భద్రత ముఖ్యం..
నిజానికి అబ్బాయిలకన్నా అమ్మాయిలే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారు. అయితే వారికి నేర్పించే సమయంలో కాన్ఫిడెన్స్, సెఫీ ్టమెథడ్స్, ట్రాఫిక్ రూల్స్ అండ్ ఎగ్యులేషన్స్ పూర్తిగా తెలియ చేయాలి. అప్పుడే వారు వారివారి పనుల కోసమే కాకుండా లాంగ్ రైడ్స్ చేయగలుగుతారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మేం గత ఏడాది 17వేల కిలోమీటర్లు దూరం విజయవంతంగా రైడ్ చేయగలిగాం అంటే జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతోనే. మన రాష్ట్రంలో చాలామంది ఆడపిల్లలకు డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది. వారి కోసం త్వరలోనే మోవో అకాడమిని ఏర్పాటుచేస్తున్నాం. ఇటీవల మన రాష్ట్రంలో సంచలనం కలిగించిన వార్తల్లో బొమ్మలరామారం ఒకటి. సరైన ట్రాన్స్పోర్ట్ లేకపోవడంతో ముగ్గురు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. అమ్మాయిలపై జరుగుతున్న దాడులల్లో ఎక్కువ శాతం వారు రవాణా కోసం ఇతరులపై ఆధారపడటమే కనిపిస్తుంది. ఆటోలు, క్యాబ్‌లు సురక్షితం కావు అన్నది స్పష్టమవుతుంది. డ్రైవింగ్ నేర్చుకుంటే వారు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు వారిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. లింగ వివక్ష తగ్గుతుంది.
ఉపాధి అవకాశాలు కల్పించేలా..
గత ఏడాది మేం ఆరుదేశాల్లో 56రోజుల పాటు బైక్‌పై వెళ్లివచ్చాం. థారులాండ్‌లో ఉమెన్ టాక్సీలు, బైక్‌లు నడుపుతున్నారు. మహిళా ఉద్యోగులు, పర్యాటకులు వారి సేవలతో సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. మనరాష్ట్రంలోనూ విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పెరుగుతున్న మహిళల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సురక్షితమైన ప్రయాణం కోసం ఉమెన్ టాక్సీ, బైక్ వాలాలు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం.