Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మందికి కనీసం ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా తీరిక ఉండదు. ఎంత బిజీగా ఉన్నా సరే కచ్చితంగా కాస్త మీ చర్మ సంరక్ష ణపై దృష్టిపెట్టండి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి కొన్ని రకాల టిప్స్ పాటిస్తే మీ అందం ఎప్పటికీ చెరగకుండా ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటో ఒక్కసారి చూడండి.
- రాత్రి పూట పడుకునే ముందు మేకప్ మొత్తం తీసి ఫేస్ వాష్ చేసుకుని పడుకోండి. ఎందుకంటే సాయంత్రం పూట బయటకు వెళ్లేందుకు చాలా మంది క్రీమ్స్ రాస్తుం టారు. వాటిని కడుక్కోకుండా అలాగే పడుకుంటే మీ చర్మ రంధ్రాలు మొత్తం మూసుకుపోయి చర్మానికి కావాల్సి నంత గాలి అందదు. దీంతో మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.
- ఉదయం లేవగానే మీరు చేయాల్సిన మొదటి పని.. మీ ముఖానికి ఆవిరి పట్టడం. దీంతో చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. కాంతివంతంగా మారుతుంది.
- నిద్రలేచిన తర్వాత కొద్ది సేపటికి ముఖాన్ని కచ్చితంగా చల్లటి నీటితో కడగాలి. ఇలా చేసుకోవడం వల్ల రాత్రంతా ముఖంపై పేరుకుపోయిన జిడ్డు వదులుతుంది. అలాగే బ్యాక్టీరియా కూడా పోతుంది. ముఖానికి కావాల్సిన రక్తప్రసరణ అందుతుంది.
ా నిమ్మకాయ, పైనాపిల్, ద్రాక్షపండ్ల రసాలతో కూడా సహజమైన పద్ధతుల్లో మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. చాలామంది ఉద యాన్నే టోనర్ ఉపయో గించరు. అయితే కచ్చి తంగా టోనర్ ఉపయో గించి ముఖాన్ని క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. ఇలా చేస్తే పీహెచ్ సమతుల్యంగా ఉంటుంది. అయితే మీరు ఉపయోగించే టోనర్స్లలో రసాయనాలు లేకుండా చూసుకోండి.
- ప్రతిరోజూ మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే చర్మం మృదువుగా ఉంటుంది. జిడ్డు ఎక్కువగా ఉండే చర్మానికి మాయిశ్చ రైజేషన్ తప్పనిసరి. అయితే మాయిశ్చ రైజేషన్ చేసుకునేందుకు మంచి క్రీమ్ ఉపయోగించండి. సూర్యుని ప్రభావం చర్మంపై పడకుండా ఉండేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే చర్మం జిడ్డుగా మారకుండా ఉంటుంది.
- అయితే ఎప్పుడైనా మీ చర్మసంరక్షణకు మంచి మేకప్‌ను ఎంచు కోవాల్సి ఉంటుంది. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని ఏవంటే అవి వాడ కూడదు. అలాంటి వాటివల్ల తాత్కాలికంగా అందం చేకూరిన తర్వాత మీరు చాలా ఇబ్బందులుపడతారు. రసాయనాలు ఎక్కువగా ఉండి ఎక్కువ రంగులు కలిసిన క్రీమ్స్ వాడకండి. కొందరు సువాసన కోసం ఎక్కువ రసాయనాలు కలిసిన క్రీమ్స్ వాడతారు. అలా అస్సలు చేయకండి. అలాంటి క్రీమ్స్ వాడితే అలెర్జీలు, చర్మవ్యాధులు రావచ్చు.
- బ్రేక్‌ఫాస్ట్ కూడా మీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. రోజూ బెర్రీలు తినడం అలవాటు చేసుకోండి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు తినాలి. దీంతో మీ బాడీకి కావాల్సిన విటమిన్ సి, ఇ అందుతాయి. విటమిన్ 'సి' సహజమైన కొల్లాజెన్లను ఉత్పత్తి చేయడం ద్వారా మీ చర్మం కాంతి వంతంగా ఉంటుంది. విటమిన్ 'ఇ' చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది.
- ఇవన్నీ పాటిస్తూ రోజూ కనీసం 8 గ్లాస్ ల నీటిని తాగితే మెరిసిపోవచ్చు.