Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకోవడానికి జుట్టును ఐరన్ చేస్తారు. లేదా రసాయన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు బలహీన పడుతుంది. చిట్లిపోయి, ఊడిపోతుంది. మరయితే స్ట్రెయిటనింగ్ చేసుకోవడం ఎలా?
వేడి నూనెతో ఫలితం :వేడి చేసి వాడడం వల్ల నూనెను జుట్టు బాగా పీల్చుకుంటుంది. దాంతో జుట్టు మదువుగా, స్ట్రెయిట్‌గా అవుతుంది. కొబ్బరి నూనె వేడి చేసి చేతివేళ్లతో మర్దనా చేస్తూ జుట్టుకి రాసుకోవాలి. ఆ తరువాత ఒక తుండును వేడి నీళ్లలో ముంచి నీళ్లను పిండేయాలి. ఆ తుండును తలపాగాలాగా చుట్టి ఐదునిమిషాలు ఉంచుకోవాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేశాక మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఆ తరువాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో దువ్వాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం బాగుంటుంది.
ఆలివ్ నూనె, గుడ్లు కలిపి: ఆలివ్ నూనెలో హైడ్రాక్సిటైరోజోల్, విటమిన్- 'ఇ'లు ఉంటాయి. ఈ రెండూ జుట్టుకి పోషణను అందించడంలో బాగా పనిచేస్తాయి. గుడ్డులో విటమిన్, మినరల్స్‌తో పాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఆలివ్ నూనెలో రెండు గుడ్ల సొనల్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి.
కొబ్బరిపాలు, నిమ్మరసం :జుట్టుకు పోషణను అందించి మదువుగా చేసేందుకు కొబ్బరిపాలు బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌లో తేమను అందించి మదువుగా ఉంచే గుణం ఉంటుంది. ఎలా వాడాలంటే ... తాజా కొబ్బరి పాలలో నిమ్మరసం కలపాలి. నిమ్మరసానికి క్లెన్సింగ్ గుణం ఉంటుంది. కొబ్బరి పాలు, నిమ్మరసం కలిపి వాడడం వల్ల జుట్టుకి అందమైన, ఆరోగ్యమైన లుక్ వస్తుంది.
పాలు, తేనెతో :కెరటిన్ అనే ప్రొటీన్‌తో జుట్టు తయారవుతుంది. అందుకే కాబోలు పాలలో ఉండే ప్రొటీన్ జుట్టుకి బలాన్నిచ్చేందుకు బాగా ఉపకరిస్తుంది. పాలల్లో ఉండే కొవ్వు జుట్టును మదువుగా ఉంచుతుంది. తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. దీనివల్ల జుట్టుకి మెరుపు వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెలో పాలు కలిపిన మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో నింపాలి. షాంపుతో తలస్నానం చేశాక మిశ్రమాన్ని జుట్టుకు స్ప్రే చేయాలి. రెండు నిమిషాల తరువాత మామూలు నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి.
బియ్యప్పిండి, ముల్తాని మట్టి, గుడ్డు తెల్లసొన : ఈ మూడింటిని కలిపి తయారుచేసిన హెయిర్ మాస్క్ వారానికి ఒకసారి వేసుకోవాలి. దీనివల్ల జుట్టు శుభ్రపడుతుంది. స్ట్రెయిటెన్ అవుతుంది. ఈ పద్ధతి పాటించడం వల్ల జుట్టు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. పావుకప్పు బియ్యప్పిండిలో ఒక గుడ్డు తెల్లసొన, ఒక కప్పు ముల్తాని మట్టి కలిపి పేస్ట్ చేయాలి. చిక్కుల్లేకుండా జుట్టు దువ్వి ఈ పేస్ట్‌ను పట్టించాలి. గంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఫలితం మీకే తెలిసిపోతుంది.