Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛమైన ఇంగువ నిమ్మ రసంతో నూరి దానితో పళ్లు తోమితే దంతాల వెంట కారే రక్తం ఆగిపోతుంది. పెద్ద ఉల్లి పాయ, ఉప్పు కలిపి నూరి దానిని దంతాలకు వేసి రుద్దినా మంచి ఫలితం కనిపిస్తుంది.
- మిక్సీ బ్లేడు పదునుగా ఉండాలంటే మిక్సీ జార్లలో కొద్దిగా ఉప్పు వేసి తిప్పాలి.
- పనీర్ ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే దానిని బ్లాటింగ్ పేపర్లో చుట్టి ఫ్రిజ్లో పెట్టాలి.
- జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
- గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇనెఫెక్షన్ బాధ నుంచి బయటపడవచ్చు.
- అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
- వేపుడు పని ఎక్కువగా ఉంటే నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే నూనె ఎక్కువగా పీల్చదు.
- కూరకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే మార్కెట్లో దొరికే మామిడి పొడికి కొంచెం పెరుగు కలపండి. టొమాటో రుచి వస్తుంది.
- కోడిగుడ్ల పెంకును జాగ్రత్తా పరిశీలించండి. మంచి షైనింగ్ ఉంటే కోడి గుడ్లు తాజావి. పెంకు కాస్తా రంగు మారిందంటే నిల్వ కోడిగుడ్లని అర్థం చేసుకోవాలి.
- క్యారెట్, టమాటో కలిపి జ్యూస్ చేసి, తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్త శుద్ధి అవుతుంది.
- ప్రతీరోజు నీళ్లలో తులసి అకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇనెఫెక్షన్ తగ్గుతుంది.