Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అన్ని సార్లు ఔషధాలతో అవసరం ఉండదు. కొన్ని సహజ పద్ధతులను ఆచరిస్తే డిప్రెషన్ నుంచి సులభంగా బయటపడొచ్చు అంటు న్నారు నిపుణులు. ఒకవేళ వైద్య సంబంధమైన అవసరం ఉంటే మాత్రం అందుకు సంబంధిం చిన మందులు తప్పక వాడాలి. వాటితో పాటు ఈ పద్ధతులను కూడా అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- కొన్ని ఆహారపదార్థాలను తినడం వల్ల శరీరంలో సెరటోనిన్ స్థాయిని పెంచు కోవచ్చు. సెరటోనిన్ డిప్రెషన్‌తో యుద్ధం చేసి దాన్ని పారిపోయేలా చేస్తుంది. ఆహారం ద్వారా సెరటోనిన్ చేరాలంటే గుడ్లు, కొబ్బరి నూనె, పుల్లటి చెర్రీలు, అవిసెగింజల నూనె, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాల వంటి వాటిని తినాలి.
- కాఫీ తాగితే మూడ్‌ని బూస్ట్ చేయొచ్చని తాగుతుంటారు. అయితే చాలా తక్కువ సేపు మాత్రమే మూడ్ బూస్ట్ అవుతుంది. కాని కొన్నిసార్లు కాఫీ కూడా డిప్రెషన్‌కి కారణం అవుతుంది. కాఫీ తాగడం వల్ల మెదడులోని రసాయనాలు అస్తవ్యస్తం అవుతాయి. కాఫీ ప్రభావం సెరటోనిన్ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకని కాఫీకి దూరంగా ఉండడం శ్రేయస్కరం.
- కాఫీలో ఉన్నట్టే గ్రీన్‌టీలో కూడా కెఫీన్ ఉంటుంది. దీంతో పాటు ఎల్-థియనైన్ అనే మరో పదార్థాన్ని కూడా కలిగి ఉం టుంది. ఇందులో సైకోయాక్టివ్ గుణాలు కొన్ని ఉన్నాయి. ఇవి డోపమైన్ లెవల్స్‌ను పెంచుతాయి. అందుకని ప్రతిరోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగితే డిప్రెషన్‌ను దరిచేరనీయదు.
నడక, స్లీప్ థెరపీ, సన్‌షైన్ థెరపీ వంటివి డిప్రెషన్‌ను ఢీ కొనడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి.
- గతంలో జరిగిన కొన్ని పరిశోధనల్లో ఆక్యుపంక్చర్ ప్రభావంతమైన యాంటీ డిప్రెసెంట్ అని వెల్లడైంది. ఆక్యుపంక్చర్ వల్ల మెదడు పనితీరు మెరుగుపడడమే కాకుండా, మెదడులోని అసమతుల్యాన్ని సరిచేస్తుంది కూడా.
మరో సహజసిద్ధ రెమెడీ చమొమైల్టీ. ఈ తేనీరు శరీరానికి ఉపశమనాన్ని కలిగించి విశ్రాంతినిస్తుంది. మనసులోని బెంగను పోగొడుతుంది. డిప్రెషన్‌తో మహా పోరాటమే చేస్తుంది ఇది.