Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండవేడిమి నుంచి బయటపడటంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూరగాయలు ఎంతగానో ఉపయోగపడుతాయి. సమ్మర్లో ఎక్కువగా కూల్‌డ్రింక్స్, ఇతరత్రా పానీయాలు తాగుతూ సేదతీరుతుంటాం. అయితే ఇవి తాత్కాలిక ఉపశమనమే తప్ప శరీరానికి మేలు చేయవు. కానీ కొన్ని రకాల కూరగాయలు ఎంతో మేలుచేస్తాయి.
కాకర కాయ : ఇది సమ్మర్ నుంచి రక్షించే కూరగాయ. వేసవికి తోడు పనిలో ఒత్తిడి కారణంగా తలెత్తే హైపర్ టెన్షన్‌ను కాకరకాయ నివారిస్తుంది. సీజన్‌గా వచ్చే పుండు, ఇన్ఫెక్షన్ తగ్గించడం, డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.
సోరకాయ : సోరకాయ వేసవిలో అత్యధికంగా నీటిశాతం కలిగి ఉంటుంది. పోషకాలను అందిస్తూ దేహానికి రక్షణగా నిలుస్తుంది. ముఖ్యంగాఎండకాలంలో ఎక్కువగా వచ్చే ఎసిడిటీని తగ్గించేందుకు ఎంతో ఉపయోగకరంగాఉంటుంది. చెమటతో కోల్పోయిన సోడియంను శరవేగంగా భర్తీ చేస్తుంది. అలసట ఉండదు.
పొట్లకాయ : దేహానికి కూలింగ్‌ను ఇస్తుంది. వేడికారణంగా పేరుకుపోతున్న పొడితత్వాన్ని దూరం చేసి ఫ్లూయిడ్స్ ఉత్పత్తి పెంచుతుందని వైద్యులంటున్నారు.
గుమ్మడికాయ : దేహాన్ని చల్లగా ఉంచి వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇందులో ఏ, బీ విటమిన్లు అధికంగా ఉంటాయి. 96 శాతం నీటి నిలువలను కలిగిఉంటుంది.
బీరకాయ :ఇది రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రావు. ఇది శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంఇ. వేసవిలో ఇవి తింటే ఎలాంటిరోగాలు తలెత్తవు.