Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది పిల్లలు రాత్రి త్వరగా పడుకోరు. పొద్దున త్వరగా లేవరు. అటువంటి వారికి కొన్ని చిట్కాల ద్వారా ఉదయం త్వరగా లేచే అలవాటు చేయవచ్చు. పిల్లలకి త్వరగా పడుకొనే అలవాటు చేస్తే సరి. ఉదయాన వారే నిద్ర లేస్తారు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకునేలా చూడాలి. కొంతమంది పిల్లలు పగలు నిద్రపోవడం వల్ల రాత్రి పూట త్వరగా పడుకోరు. అందుకే వారిని పగలు నిద్రపోవనివ్వకూడదు. ఒకవేళ పడుకున్నా ఇరవై నిమిషాలే నిద్రపోనివ్వాలి. స్నానం చేయడం, ఏదైనా పుస్తకం చదవడం, సంగీతం వినడం ద్వారా వారికి త్వరగా నిద్రపడుతుంది. అలాగే బాగా అలసిపోయినప్పుడు పిల్లలు త్వరగా నిద్ర పోతారు. అందుకే వారిని సాయంత్రం వేళలో కొంత సేపు ఆటలాడించాలి. అలాగే పొద్దున్నే త్వరగా లేవడం కూడా వారికి అలవాటు చేయాలి. మొదట్లో కొన్నిరోజులు మారాం చేసినా తరువాత వారికే అలవాటైపోతుంది.