Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కిచెన్‌లో. అందుఏ ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు.
- వంట గదిలో పనిచేస్తున్న సమయంలో స్టౌ మీద నూనె గానీ, అలాంటి మరో ద్రవం గానీ, స్టౌమీద పడకుండా చూడాలి. ఒక్కోసారి వండుతున్న పదార్థం లోంచే కొన్ని పదార్థాలు పొంగుకు వచ్చి స్టౌ పైన పడి మంటలు లేచే ప్రమాదం ఏర్పడుతుంది.
- వంటకు ఉపక్రమించడానికి ముందు స్టౌను శుభ్రం చేయడం చాలా అవసరం. అలా వండే పదార్థాలను కూడా శుభ్రం చేయడం అవసరం.
- ఏ రకమైన కార్డ్స్ కూడా స్టౌ దగ్గరలో వేళ్లాడకుండా చూసుకోవాలి.
- అగ్నినిరోధక యంత్రాన్ని కిచెన్‌లో పెట్టుకోవడం మరువద్దు.
- కాగితాలను, ప్లాస్టిక్ బ్యాగ్‌లను, కర్టెన్లను, డిష్ టవల్స్‌ను స్టౌకు దూరంగా ఉంచాలి. అగ్గిపెట్టెలను, లైటర్లను క్యాబినెట్లలో పెట్టుకోవాలి.
- దీపాలను, లాంతర్లను, అగ్నికారక వస్తువులను క్యాబినెట్లలో ఉంచి తాళం వేయాలి. పిల్లలకు అందకుండా కూడా జాగ్రత్త పడాలి.
- వంటగదిలో స్మోక్ అలారం అమర్చాలి. కాకపోతే వాటిని తెరిచీ, మూసే సమమాల్లో ఇబ్బందులు రాకుండా, వాటిని కిటీకీలకూ, తలుపులకూ దగ్గరగా ఉంచకూడదు.
- ప్రమాదకారకమైన క్లీనింగ్ ప్రొడక్ట్స్‌ను క్యాబినెట్లో ఉంచి తాళం వేయడం మంచిది. అలాగే పిల్లలకు అందకుండా వాటిని దూరంగా ఉంచడం కూడా అవసరం.
- ఫుడ్ కంటేనర్లలో గానీ, గ్లాసుల్లో గానీ విషపూరితమైన పదార్థాలను వేయకూడదు.
- టవల్స్ మీద గానీ, నాప్కిన్స్ల మీద గానీ, టేబుల్ క్లాత్‌ల మీద గానీ వేడి వస్తువులను ఉంచకూడదు.
- పాత్రలను శుభ్రం చేసే చోట కత్తులను గానీ, మరే పదునైన వస్తువుల్నిగానీ ఉంచకూడదు. కత్తుల్ని నైఫ్ గార్డ్స్ల్లో గానీ, బచర్ బ్లాకుల్లో గానీ, ఉంచితే, పాత్రల్ని శుభ్రం చేసే సమమంలో చేతులు గాయం కాకుండా ఉంటాయి.
- వంట చేసే సమమంలో వంట సరుకుల్ని స్టౌ లేదా ఓవెన్‌కు మధ్యలో వేయాలి.
- వెంటిటేషన్ ఉండేందుకు వీలుగా రిఫ్రిజిరేటర్ల వెనుక ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిచెన్‌లో ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు.