Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా శవాసనం వేయాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడికాలిని పొట్టపైకి మడిచి రెండుచేతివేళ్ళను మోకాలి కింద ఇంటర్లాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ తలవైపు కాలిని లాగుతూ చిబుకాన్ని కుడి మోకాలికి ఆనించాలి. ఇప్పుడు శ్వాసను కొద్దిక్షణాలు ఆపాలి. ఈ విధంగా దాదాపు 20సెకన్లు నుంచి వీలైనంత సేపు ఉండి యధాస్థితికి రావాలి. ఆ తర్వాత ఎడమకాలితో ఇదే విధంగా చేయాలి. ఆ తర్వాత రెండు కాళ్లను చాతీపైకి మడిచి శ్వాస వదులుతూ తలను పైకి లేపి చుబుకాన్ని రెండు మోకాళ్ల మధ్య ఆనించే ప్రయత్నం చేయాలి. 30సెకన్ల పాటు అలాగే ఉండి యధాస్థితికి రావాలి.
ఇలా ఐదు రౌండ్స్ చేయాలి.
ఉపయోగాలు..
- జీర్ణాశయ సమస్యలకు ఆ ఆసనం సంజీవిని వంటిది.
- లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది.
- అసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
జాగ్రత్తలు..
- మెడనొప్పి ఉన్నవారు, గర్భిణీలు, గుండె సమస్యలు, అల్సర్లు ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.