Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డైనింగ్రూమ్కు ప్రత్యేకమైన లుక్ తీసుకురావడంలో లైటింగ్ పాత్ర కీలకం. యాక్సెంట్ లైట్స్, జార్జియస్ శాండ్లియర్స్, పెండాంట్ లైట్స్ డైనింగ్ రూమ్‌కు బాగా నప్పుతాయి. వీటిల్లో మీ అభిరుచిని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.
డైనింగ్ రూమ్‌లో లైటింగ్ ఏర్పాటు చేసుకునే ముందు గది విస్తీర్ణం, డెకరేషన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. గదిలో సరైన వెలుతురు ఉండాలంటే లేయర్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల భోజనం చేసే సమయంలో వెలుతురు నేరుగా కంటిపై పడకుండా ఉంటుంది. డైనింగ్ ఆహ్లాదంగా ఉంటుంది.
- డైనింగ్రూమ్లో తగినంత వెలుతురు కోసం టేబుల్ల్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం సులభమైన పద్ధతి. మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాల టేబుల్ ల్యాంప్‌లు అందుబాటులో ఉన్నాయి.
- డైనింగ్‌రూమ్ ఆకర్షణీయంగా కనిపించడానికి శాండ్లియర్ లైటింగ్ మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. శాండ్లియర్ను డైనింగ్ టేబుల్‌పై తగినంత ఎత్తులో అమర్చుకోవాలి. దీనివల్ల వెలుతురు సరిగ్గా పరుచుకుంటుంది. ఇక గ్లాస్ శాండియ్లర్స్ అమర్చుకుంటే డైనింగ్ రూమ్ తళుకులీనుతుంది. ఇవే కాకుండా బ్రాస్, అల్యూమినియం, క్రిస్టల్ శాండ్లియర్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
- గుండ్రంగా ఉన్న డైనింగ్ టేబుల్ ఉపయోగిస్తున్నట్లయితే ఒకటే పెన్డాంట్ సరిపోతుంది. దీర్థచతురస్రాకారంలో ఉన్నట్లయితే నాలుగైదు పెన్డాంట్లను ఏర్పాటుచేసుకోవచ్చు. వీటివల్ల వెలుతురు ఎక్కువగా ఉండటమే కాకుండా ఆధునికత ఉట్టిపడుతుంది. ప్రస్తుతం ఎత్తు అడ్జస్ట్ చేసుకునే పెన్డాంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరానికనుగుణంగా ఎత్తును పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయవచ్చు.
- డైనింగ్రూమ్లో డిమ్మర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో క్యాండిల్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల డిఫరెంట్ లుక్ వస్తుంది. ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ విధంగా అలంకరించుకోవచ్చు. సందర్భానికి అనుగుణంగా లైటింగ్‌లో మార్పులు కూడా చేసుకోవచ్చు.
- డైనింగ్ టేబుల్ చివరన యాక్సెంట్ లైట్స్ ఏర్పాటుచేసుకుంటే గది మెరిసిపోతుంది. వీటిని గది గోడలకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే నీడలు నివారించడానికి సరియైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి.