Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యవ్వనంగా కనిపించేలా చేసే తిరుగులేని మందులంటూ యాంటీ ఏజింగ్ క్రీములు మార్కెట్లోకి కుప్పలుగా వచ్చిపడుతున్నాయి. అయితే అలాంటి వాటితో ఉపయోగం లేకపోగా లేనిపోని సమస్యలు వస్తాయి. వాస్తవానికి ప్రకతి సిద్ధమైన తాజా పండ్లు, కూరగాయల్లోనే అన్ని రకాల వద్ధాప్య సమస్యల్ని దూరం చేసే పలు అంశాలు ఉన్నాయి.
బ్రొకోలి : దీనిలో భారీ మొత్తంలో పీచుపదార్థం, విటమిన్- సి ఉంటాయి. ఇవి శరీర బరువును
తగ్గించడమే కాకుండా, గుండె జబ్బులకు వ్యతిరేకంగా పోరాడతాయి.
బ్లూ బెర్రీస్ :వీటిల్లో విటమిన్- సి సమద్ధిగా ఉంటుంది. ఇది రక్తప్రసరణ సులువుగా జరగడానికి తోడ్పడుతుంది. బ్లూబెర్రీస్‌లో ఉండే కొన్ని రకాల లవణాలు, వద్ధాప్య వేగాన్ని తగ్గిస్తాయి. పొటాషియం కూడా వీటిల్లో ఎక్కువగా ఉండడం వల్ల బాగా చురుకుదనం లభిస్తుంది.
అవకాడో :పెద్ద మొత్తంలో విటమిన్-ఇ ఉండడంతో పాటు, అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. అవకాడోలో చర్మకణాలను పునరుత్పత్తి చేసే శక్తి ఉంది. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా కనపించడమే కాకుండా, యవ్వనపు మెరుపు కనిపిస్తుంది.
కిడ్నీ బీన్స్ : ఈ పప్పుధాన్యాల్లో పీచుపదార్థం, పొటాషియం సమ ద్ధిగా ఉంటాయి. ఇది కొలెస్టాల్ర్ నిలువల్ని తగ్గించడం ద్వారా గుండె జబ్బుల బారిన పడకుండా చేస్తాయి. అంతకన్నామించి కిడ్నీ బీన్స్‌ల్లో ప్రొటీన్లు నిండుగా ఉంటాయి.
డార్క్ చాక్లెట్ :70 శాతం కోకో ఉండే ఏ చాక్లెట్లో అయినా ప్రొటీన్, విటమిన్-బి కావలసినంత ఉంటాయి. తరుచూ చాక్లెట్ తినే వారిలో కొవ్వు బాగా కరిగిపోతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా మారతాయి.