Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసినపుడు అది ఆహ్లాదంగా.. వారి అభిరుచికి తగినవిధంగా ఉండాలి. ఆడుకునేవిధంగానూ ఉండాలి. అప్పుడే వారు గదిని ఇష్టపడుతారు. అలా ఏర్పాటు చేసినపుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు...
- పిల్లల గదులను వస్తువులతో నింపేయకుండా యాక్టివిటీస్ చేయడానికి తగినంత స్థలాన్ని ఇవ్వాలి. గది మరీ చిన్నగా ఉన్నట్లయితే ఫర్నిచర్ ఎక్కువగా పెట్టకూడదు. రాక్స్ పెట్టినట్లయితే వాటిలో టార్సు, బుక్స్‌ను అమర్చుకోవచ్చు.
- పిల్లల హాబీలను గుర్తించి దానికి తగిన విధంగా ఫోటోగ్రాఫ్స్‌ని పేస్ట్ చేయాలి. పెన్సిల్స్, కలర్స్, గిటార్ వంటి మ్యూజికల్ ఇన్స్ట్రు మెంట్స్‌ను అమర్చుకోవడానికి స్టాండ్‌ని ఏర్పాటు చేయాలి.
- అమ్మాయిల గదికైతే పింక్ రంగును ఎంచుకోవచ్చు. అలాంటప్పుడు పిల్లోస్, కర్టెన్స్.. ఇలా అన్నీ పింక్ రంగులో ఉండేలా చూసుకోవాలి.
- పిల్లలు సహజంగానే కార్టూన్ పిక్చర్లు చూడటానికి ఇష్టపడతారు. కాబట్టి వారి గదుల్లో గోడలు కార్టూన్ బొమ్మలను వేయించాలి. మిక్కీమౌస్, ఫెయిరీ, ఫ్లవర్స్, స్పైడర్మాన్ బొమ్మలను వేయించవచ్చు.
- పిల్లల్లో క్యూరియాసిటీని పెంచాలంటే అడ్వెంచర్ థీమ్స్‌ను గోడలకు వేసుకోవచ్చు. వైల్డ్ ఎనిమల్స్ బొమ్మలను వేయించవచ్చు. పులులు, గుర్రాలు, ఏనుగుల బొమ్మలు ఉన్న పిల్లోస్, కర్టెన్స్‌ను ఉపయోగిస్తే పిల్లలు మరింత ఇష్టపడతారు.
- చోటా భీమ్, హనుమాన్, లిటిల్ నిక్, బేర్ బ్రదర్స్...ఇలాంటి యానిమేటెడ్ ఫిల్మ్స్‌ను చూడటానికి ప్రతీ పిల్లాడు ఇష్టపడతాడు. పిల్లల కోసం దుస్తులు, ఫర్నిచర్ కొనేటప్పుడు ఈ యానిమేటెడ్ ఫిల్మ్ థీమ్స్‌ను ద ష్టిలో పెట్టుకోవాలి. వాల్ పేపర్స్‌ను గది గోడలకు అతికించవచ్చు. రంగులతో డిజైన్ చేయించినా బాగుంటుంది.
- పిల్లల గదులు స్లిప్పరీగా ఉండకుండా చూసుకోవాలి. బాత్రూమ్లో యాంటీస్కిడ్ టైల్స్‌ను వేయించాలి.
- పిల్లల గదుల్లో ఫ్లోర్ ల్యాంప్స్ ఉపయోగించకూడదు. ఎలక్టిక్రల్ స్విచ్‌లు, ప్లగ్‌లు, సాకెట్లు పిల్లలకు అందకుండా తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
- ఫ్లోర్ లెంగ్త్ కర్టెన్స్‌ను పెట్టకూడదు. పిల్లలు కర్టెన్స్‌తో ఆడి పడిపోయే అవకాశం ఉంటుంది.
- పిల్లల కోసం బెడ్ ఎంపిక చేసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్ బెడ్స్‌ను పిల్లల కోసం తీసుకోవచ్చు. అయితే ఐ క్యాచింగ్ కలర్స్‌ని ఎంపిక చేసుకోవాలి. ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఇద్దరికీ ఒకే చోట అప్పర్, లోయర్ పోర్షన్ ఉన్న బెడ్స్‌ను తీసుకోవచ్చు.
- పిల్లలు చదువుకునే సమయంలో, రాసుకునే సమయంలో ఇబ్బంది లేకుండా టేబుల్‌కు తగిన ఎత్తులో ఉండే విధంగా కుర్చీలను ఎంపిక చేసుకోవాలి. అదే సమయంలో కుర్చీలు కంఫర్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.
- పిల్లల బొమ్మలు, ఆట వస్తువుల స్టోరేజ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని బెడ్ కింద పెట్టడం మంచి ఆప్షన్. ప్రస్తుతం మార్కెట్లో పుష్ అవుట్ డ్రాస్ ఉన్న బెడ్స్ లభిస్తున్నాయి.
- అందమైన బాస్కెట్స్, ప్లాస్టిక్ బాక్స్‌ల్లో కూడా బొమ్మలను సర్దవచ్చు. గది మూలల్లో టార్సును పెట్టడం వల్ల ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది.
- కిడ్స్ గది డెకరేషన్ విషయలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు అమితంగా ఇష్టపడతారనడంలో సందేహం లేదు.