Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు ప్రశ్నల కుప్పలు. ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న. తల్లిదండ్రులందరూ సమాధానం చెబుతారు. కానీ... ఆమె ఆ సమాధానాన్ని పాట రూపంలో చెప్పింది. అదో ఆల్బమ్ అయ్యింది. ఇంకేముంది... ఆ ఆల్బమ్ చిల్డ్రన్ కేటగిరీలో గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యింది. గాయని.. ఫల్గుణి షా. కొడుకు షాబాద్.
ముంబైలో పెరిగిన ఫల్గుణి తల్లి పాడుతున్న పాటలు వింటూ ఉండేది. కొన్ని ఏండ్ల తరువాత ఆర్డీ బర్మన్ హిట్స్ ప్రేమలో పడిపోయింది. సోదరుడు దర్శన్ తబలా నేర్చుకున్నాడు. ఆరేండ్ల వయసులో ఓ యాక్సిడెంట్ అయ్యింది. విపరీతమైన నొప్పి ఉండేది. ఆ నొప్పి నుంచి బయటపడటకోసం పాటలు పాడు అని సలహా ఇచ్చింది తల్లి. అది మొదలు ఎప్పుడూ పాడటం ఆపలేదు. కౌముది మున్షి, ఉదరు మజుందార్ దగ్గర... గుజరాతీ జానపదాలను, గజల్స్‌ను నేర్చుకున్నది. అ ఆ తరువాత సారంగి మ్యాస్ట్రో సుల్తాన్ ఖాన్ దగ్గర హిందుస్తానీ సంగీతాన్ని అభ్యసించింది. కిశోరీ అమోంకర్ దగ్గర జైపూర్ అట్రౌలీని అవపోసన పట్టింది. కిశోరీ అమోంకర్ ప్రతిభ చూసి ముగ్ధురాలయ్యింది. 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లింది. గౌరవ్షాను పెండ్లి చేసుకున్న తరువాత ఆమె మ్యూజికల్ కెరీర్ మలుపు తిరిగింది.
2007లో మొట్టమొదటి ఆల్బమ్ 'ఫలు' చేసింది. ఆ తరువాత కాలంలో గొప్పగొప్ప సంగీతకారులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందామెకు. అమెరికన్ కంపోజర్ ఫిలిఫ్ గ్లాస్, ఏఆర్ రెహ్మాన్‌లతో కలిసి పనిచేసింది. 2009లో రెహ్మాన్‌తో కలిసి వైట్‌హౌజ్‌లో ప్రదర్శన ఇచ్చింది. 2013లో 'ఫోరాస్ రోడ్' పేరుతో సెకండ్ ఆల్బమ్ చేసింది.
ఫల్గుణి న్యూయార్క్‌లో స్థిరపడింది. మూడేండ్ల తన బాబు... ప్లే స్కూల్ నుంచి ఇంటికి రాగానే రకరకాల ప్రశ్నలు వేసేవాడు. వాళ్లందరూ ఇంగ్లీష్లోమాట్లాడుకుంటుంటే.. మనం ఇంటి దగ్గర గుజరాతీ ఎందుకు మాట్లాడతాం? మన ఆహారం ఎందుకు పచ్చగా ఉంటుంది? ఇతర పిల్లలదెందుకు భిన్నంగా ఉంటుంది? ఇలా అనేక ప్రశ్నలు. అప్పుడు కొడుకుకు తన మూలాల గురించి చెప్పాలనుకుంది. అతని ఐడెంటిటీ ఏంటి? సంస్కృతి ఏంటో వివరించాలనుకుంది. అది కూడా పాట ద్వారా. ఇప్పటిదాకా యూట్యూబ్‌లో ఉండే పిల్లల పాటల్లో హాస్యం ఉంటుంది. వినోదం ఉంటుంది. కానీ లోతైన అర్థం ఉండదు. కానీ... సంగీతంతో కొడుకును ఎడ్యుకేట్ చేయాలనుకుంది. ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాసుకుని.. పాటలా కంపోజ్ చేసి కొడుకుకు వినిపించేది. అలా 12 పాటలు చేసింది. ఆ తరువాత ఆ పాటలను హిందీ, ఇంగ్లీష్‌లోనూ అనువదించింది. ఆల్బమ్ తయారైపోయింది. దాని పేరు 'ఫలూ'స్ బజార్'. ఇండియన్ క్లాసిక్స్‌కు ఆధునిక ఈస్తటిక్స్ కలిపి 'ఇండీ హిందీ' పేరుతో అసాధారణ సంగీతాన్ని అందిస్తోంది. ప్రస్తుతం.. గాలిబ్ గజల్స్‌తో కొత్త ప్రాజెక్ట్ చేసే పనిలో ఉంది.