Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నో జబ్బులు వంటనూనెలు మితిమీరి వాడటం వల్లే వస్తుంటాయి. అలాగని వాటిని పూర్తిగా మానే సినా మంచిది కాదు. కాబట్టి ఏ నూనెలో ఏముం టుందో తెలిస్తే అవసరాన్ని బట్టి అది వాడవచ్చు.
బాదం నూనె : ఈ నూనె ముఖ్యంగా రెండు సమస్యలను తగ్గిస్తుంది. ఒకటి గుండెజబ్బు, రెండు క్యాన్సర్. మంచి కొవ్వును పెంచుతుంది.
కొబ్బరినూనె :చెడు బ్యాక్టీరియాను తరిమేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందించి రోగనిరోధకశక్తిని పెం పొందిస్తుంది. కొబ్బరినూనె వాడకంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
రైస్‌బ్రాన్ ఆయిల్ : ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువ. మోనోశాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ. సహజసిద్ధమైన విటమిన్-ఇ లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. చర్మకాంతిని మెరుగుపరిచే పోషకాలు రైస్బ్రాన్లో ఉంటాయి. ఈ నూనెతో ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుంది.
ఆలివ్ ఆయిల్ : అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి నాడీ మండల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది.
సన్‌ఫ్లవర్ నూనె: పొద్దుతిరుగుడు గింజల నూనె వాడకం శ్రేయస్కరం. ముఖ్యంగా హద్రోగ సంబంధిత జబ్బుల్ని రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఈ నూనెలోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. కొలోన్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుం టుందీ నూనె. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నాడీమండల వ్యవస్థను చురుగ్గా మార్చివేస్తుంది.
వేరుశనగ నూనె :శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చే నూనె ఇది. మోనో శాచురేటెడ్, పోలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికం. హద్రోగాలు, క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడే ఒమెగా-3 ప్యాటీ ఆసిడ్స్ కూడా వేరుశనగ నూనెలో ఉన్నాయి. అయితే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు పొగ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఆవనూనె :జీర్ణశక్తిని పెంపొందించే గుణం అధికం. ఉదరంలో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియా, వైరస్‌ను అడ్డుకుంటుంది ఆవనూనె. దగ్గు, జలుబులతో పాటు చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం అందిస్తుంది. ఈ నూనె వాడకం వల్ల కడుపులో మంట కూడా తగ్గుతుంది.
పామ్ ఆయిల్ :కెరొటిన్, విటమిన్-ఇ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పామ్ ఆయిల్లో ఉంటాయి. వయసును తగ్గించే గుణాలు కూడా ఇందులో ఎక్కువ. క్యాన్సర్, అల్జీమర్స్, ఆర్థరైటిస్ బాధితులకు పామ్ ఆయిల్ మంచిది. అయితే మోతాదుకు మించి వాడకూడదు.