Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెత్తగా ఉడకబెట్టిన గుడ్ల విషయంలో.. తెల్లసొన మెత్తగా వుండి కదులుతున్న పచ్చసొన కావాలంటే తక్కువ సేపు ఉడకాలి. అలాగే కుదురుకున్న తెల్ల సొన, కొద్దిగా కుదురుకున్న పచ్చ సొన కావాలంటే ఎక్కువ సేపు ఉడకాలి. ఏదైనా ప్రత్యేక వంటకం కోసం బాయిల్డ్ ఎగ్ చేసేటప్పుడు గుడ్ల లోని పచ్చ సొన మధ్యలోనే ఉండాలనుకుంటే గుడ్లను ముందు నుంచే చల్లటి నీటిలో వేసి మెల్లిగా ఉడకనివ్వాలి. ఇలా జరుగుతుండగా ఒక చెక్క స్పూన్ తో దాన్ని పూర్తిగా ఉడికేదాకా మధ్యమధ్యలో కదపాలి. ఇలా కాకుండా తీవ్రమైన వేడి నీటి లో ఉడికిస్తే గుడ్లు రబ్బర్ లాగా సాగి, గట్టిగా మారిపోతాయి. తీవ్రంగా ఉడికిస్తే గుడ్లలోని మాంసకృత్తులు గట్టిగా అయిపోతాయి. వేడి మీద గుడ్లు గడ్డ కట్టుకు పోతాయి కనుక ఉడకబెట్టే అన్ని మంచి విధానాలు తక్కువ సెగ మీద మెల్లిగా వండడాన్నే సూచిస్తాయి.
ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లకు ఎక్కువ పి.హెచ్ వుండి త్వరగా పగిలిపోతాయి, కానీ వాటి డొల్ల వొలిచి వేయడం తేలిక. ఎక్కువ గుడ్లు ఒకే సారి ఉడకబెట్టడానికి ప్రత్యేక ఎగ్ హోల్డర్ కొనవచ్చు. గుడ్లు పగిలితే ఒక చుక్క వినేగార్ వేయండి, డొల్ల నుంచి కారడం ఆగిపోతుంది. పగిలిన గుడ్లను అల్యూమిమియం ఫాయిల్ లో వుంచి ఉడికించవచ్చు. వేడి గుడ్లను జాగ్రత్తగా బయటకు తీయండి. ఒక వెడల్పాటి స్పూన్ తో ఉడికే నీటి నుంచి తగిన సాధారణ జాగ్రత్తలతో గుడ్లను బయటకు తీయండి.