Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెరకురసంతో సహజమైన శక్తి వస్తుంది. ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ తియ్యని రసం బలవర్ధకమైనది కూడా.
- చెరకురసాన్ని ఎక్కువగా వేసవికాలం తీసుకుంటారు. ఇందుకు కారణం శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటమే.
- చెరకుగెడ తింటే దంతాలకు మంచిది. చెరకు రసం విషయానికొస్తే ఇందులో నీటిశాతం 75 శాతం దాకా ఉంటుంది. సుక్రోజ్, ఫైబర్, మినరల్స్‌తో పాటు కార్బొహైడ్రేట్స్, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్ ఉంటాయి.
- సాధారణంగా జ్వరం వచ్చిన సమయం లో చెరకురసాన్ని సేవిస్తే ఇందులోని చక్కెర, ప్రొటీన్లు, ఎలక్టోల్రైట్స్ వల్ల శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. దీంతో చక్కటి రిలీఫ్ కలుగుతుంది.
- యూరిన్ సమస్యలను పోగొడుతుంది. మూత్రం మంటగా వస్తుంటే చెరకురసంలో కాస్త నిమ్మరసం కలిపి తాగితే తగ్గిపోతుంది. యూరిన్ తక్కువగా వచ్చే వారి సమస్య కూడా చెరకురసం తాగితే పోతుంది.
- చెరకురసంలో విరేచనాలను అరికట్టే లక్షణం ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- చక్కటి యాంటీసెప్టిక్‌గా పని చేస్తుంది. శ్లేష్మాన్ని అరికట్టే చక్కని ఔషధంలాగా ఇది ఉపయోగపడుతుంది.
- కండ్లు, మెదడు, గుండె, జీర్ణక్రియ చురుగ్గా ఉండటానికి చెరకురసం ఉపయోగ పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.