Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యానికి గ్రీన్ టీ మంచిదని మనకి తెలిసిందే. మరి గ్రీన్ కాఫీ గురించి ఎంతమందికి తెలుసు? ఇంకా చాలామందికి తెలియదు. ఎందుకంటే దీని వాడకం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. రోస్ట్ చేయని కాఫీ గింజల్ని నానబెట్టి, వాటి నుంచి ఎక్స్ ట్రాక్ట్ చేసేదే గ్రీన్ కాఫీ. దీనిలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ను బాగా కరిగిస్తుంది. అంతేకాదు... ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా మెరుగు పరుస్తుందట.
- దానివల్ల చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడుతుంది. ఆకలిని కూడా అదుపు చేస్తుందట. తద్వారా ఫుడ్ తక్కువ తీసుకుంటాం కాబట్టి బరువు పెరిగే ప్రమాదం తగ్గిపోతుంది. ఇది మెదడును కూడా ఫ్రెష్ గా ఉంచుతుందట. కాబట్టి గ్రీన్ కాఫీని హ్యపీగా తాగేయమంటున్నారు వైద్యులు.
- మార్కెట్లో గ్రీన్ కాఫీ మూడు రకాలుగా దొరుకుతోంది. పౌడర్ రూపంలో, డ్రై చేసి ఫ్రీజ్ చేసిన గింజలు, గ్రాన్యూల్స్... ఇలా మూడు రూపాల్లో లభ్యమవుతోంది. వీటితో దేన్ని వాడినా ఫర్వాలేదు. అయితే వీలైనంత వరకూ షుగర్ కానీ తేనె కానీ కలుపుకోకుండా తాగితేనే మంచిది. మరింత ఉపయోగకరంగా ఉండటానికి పుదీనా ఆకులను కానీ, దాల్చినచెక్క కానీ, అల్లం కానీ వేసి మరిగించి తాగితే మరీ మంచిదట. కాస్త పసుపు కలిపి తాగినా కూడా చాలా మంచిదంటున్నారు. అయితే ఆహరం తిన్న వెంటనే మాత్రం ఎప్పుడూ తాగకూడదట. రోజుకు ఓ మూడు కప్పులు గ్రీన్ కాఫీ తాగితే తొందరగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఇంకెందుకాలస్యం... గ్రీన్ కాఫీకి గ్రీన్ సిగల్ ఇవ్వండి!