Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం వంటకాల్లో తరచుగా వెల్లుల్లిని వాడుతూనే ఉంటాం. ఇది ఆహార పదార్థాలకు మంచి రుచిని తెచ్చిపెట్టడమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బోలెడన్ని రసాయనాలున్నాయి. ఇవి మనకు ఎలాంటి లాభాలు కలుగచేస్తాయో చూద్దాం
- వెల్లుల్లిలో గంధక రసాయనాలు పెద్దమొత్తంలో ఉంటాయి. వీటికి ఒకరకమైన ఘాటు వాసనను తెచ్చిపెట్టేవి ఇవే. ఈ రసాయనాలు రక్తనాళాల్లో గార (ప్లాక్) పేరుకోకుండా కాపాడతాయి. ఇక దీనిలోని ఆజోయేన్ రక్తం గడ్డలు కట్టకుండా కాపాడుతుంది.
- వెల్లుల్లిలోని డయాలీల్ సల్ఫైడ్, థియోక్రెమోనోన్లు వాపు నివారకాలుగా ఉపయోగపడతాయి. ఇక సల్ఫైడ్లు కొన్ని రకాల క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతాయి.
- అలిసిన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీఫంగస్గా పనిచేస్తుంది. ఇది పలురకాల ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుం దన్నమాట. రక్తనాళాలు ముడుచుకుపోయేలా చేసే యాంటియోటెన్సిన్ అనే ప్రోటీన్ పనితీరునూ ఆలిసిన్ అడ్డుకుంటుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది.
-వీటిల్లోని పాలీసల్ఫైడ్లు శరీరంలోకి వెళ్లాక హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులుగా మారతాయి. ఇది రక్తనాళాలను సాగేలా చేసి రక్తపోటు తగ్గేందుకు తోడ్పడుతుంది.
- తరచూ జలుబు బారినపడేవారు వెల్లుల్లిని తీసుకుంటే మంచిఫలితం ఉంటుంది.
- మనశరీరం ఇనుమును గ్రహించుకునేలా చేయడంలో ఫెర్రోపోర్టిన్ అనే ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలోని డయాలీల్ సల్ఫైడ్లు ఈ ఫెర్రోపోర్టిన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇనుముసంబంధ జీవక్రియలు మరింత చురుగ్గా సాగడానికీ తోడ్పడుతుంది.