Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టు చీరలు ఉతికేటప్పుడు బకెట్ నీటిలో కొంచెం నిమ్మరసం, ఉప్పు కలిపితే రంగు పోవు.
- వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండా లంటే కూరలో టీస్పూన్ పాలు కలపాలి.
- బిస్కెట్ ప్యాకెట్ బియ్యం డబ్బాలో ఉంచితే అవి మెత్తబడవు.
- పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండా లంటే గిన్నె అంచులకు నూనె రాయాలి.
- వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉం చితే చాలా వరకు తాజాగా ఉంటాయి.
- ఈగల బెడద లేకుండా ఉండాలంటే పుదీనా ఆకుల్ని గది నాలుగు మూలల్లో ఉంచాలి.
- శనగపిండితో స్టీలు, వెండి సామాన్లు తోమితే చక్కగా శుభ్రపడతాయి.
- మజ్జిగ పల్చనైతే కొన్ని కరివేపాకులు, ఉప్పుకలిపి రుబ్బి ఈ మిశ్రమాన్ని అందులో కలపాలి. మజ్జిగ రుచిగానూ, చిక్కగానూ ఉంటుంది.