Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తూ.. వంటింటి చికాకులకు ఫుల్స్టాప్ పెట్టింది ఇండక్షన్ స్టవ్. అయితే ఈ కరెంట్ పొయ్యి వాడకంలో కొన్ని ప్రమాదాలున్నాయి. వండే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా ఇబ్బందులే. అందుకే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
- వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు కానీ, ఇతర ద్రవపదార్థాలు కానీ పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్టవ్ మన్నిక తగ్గడంతో పాటు ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
- ఇండక్షన్ స్టవ్‌లను క్లీన్ చేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెత్తటి పొడి బట్టతో శుభ్రం చేయాలి. నీటితో గానీ తడి బట్టతో వీటిని క్లీన్ చేయకూడదు.
- ఇండక్షన్ స్టవ్‌లకు మన్నికైన స్విచ్‌బోర్డు ద్వారా కరెంట్ సరఫరా అయ్యేలా చూడాలి. ఎక్స్టెన్షన్ బాక్స్‌లను వాడటం వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవించవచ్చు.
- మెటల్ ప్యానల్ ఉన్న పాత్రలనే వాడాలి. వంట పూర్తయిన తర్వాత స్టవ్ పైనుంచి పాత్రలను తీసేటప్పుడు స్విచ్ఛాప్ చేయడం మరచిపోకండి.
- ఇండక్షన్ స్టవ్ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్ దగ్గర్లో ప్లాస్టిక్ వస్తువులు, బట్టలు ఉంచడం ప్రమాదకరం.
- వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్ఛాప్ చేసేసి ఊరుకోవద్దు. పిన్ నుంచి ప్లగ్‌ను తొలగించడం కూడా తప్పనిసరని గ్రహించండి.