Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనియాలను వంటింట్ల్లో విస్తృతంగా వాడుతుంటాం. అవి వంటకు మంచి రుచిని ఇస్తాయి. దాంతో పాటు... ఒంటికీ ఎంతో మేలు చేస్తాయి.
- చర్మం పొడిబారటం, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో చర్మ వ్యాధులు, ఎగ్జిమా.. మొదలైన వాటికి ధనియాలు మందులా పనిచేస్తాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాల వలన ఇది సాధ్యమవుతుంది. ధనియాలను నీరు కలిపి మెత్తగా నూరి తేనెతో కలిపి సమస్య ఉన్న చోట రాస్తూ ఉంటే ఫలితం ఉంటుంది.
- ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. వీటిలో ఉన్న విటమిన్ సి చెడు కొలెస్ట్రాని తగ్గిస్తుంది.
- ధనియాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ధనియాలను నానబెట్టిన నీటిని రోజుకి రెండుమూడుసార్లు తాగుతూ ఉంటే గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
- నెలసరి కారణంగా వచ్చే పొత్తి కడుపు నొప్పులకు కూడా ఇవి చక్కని ఔషధం. ధనియలు నానబెట్టిన నీటిలో పంచదార కలుపుకుని తాగటం వలన ఫలితం ఉంటుంది. కంటి ఆరోగ్యానికి కూడా ధనియాలు మంచివి.
- ధనియాల్లో రక్తంలోని చక్కెరస్థాయిని క్రమబద్ధీకరించే శక్తి ఉంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కూడా ఇవి తగ్గిస్తాయి.
- వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం, పీచు, విటమిన్ సి, కె, ప్రోటీన్లు వీటి ద్వారా లభిస్తాయి. కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, థయమిన్, నియాసిన్, కెరోటిన్ లాంటివి కూడా ధనియాల్లో ఉన్నాయి.
- ఇవి బరువుని తగ్గిస్తాయని రుజువైంది. వేడినీళ్లలో ధనియాలను వేసి మరిగించి, ఆ నీటిని అలాగే రాత్రంతా ఉంచి తరువాత రోజు తాగుతూ ఉంటే ఫలితం ఉంటుంది.
- ధనియాల నీళ్లు, టీ, ఇంకా మరే రూపంలో తీసుకున్నా థైరాయిడ్ సమస్యలకు మందుగా పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తున్నా, మందగించినా... ధనియాల వలన ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వలన ఇవి హార్మోన్లను బ్యాలన్స్ చేస్తాయి.
- ధనియాల్లో మధుమేహాన్ని అదుపుచేసే లక్షణాలు సైతం ఉన్నాయి. ఇన్సులిన్ని క్రమబద్ధీకరించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఇవి తగ్గిస్తాయి. రాత్రంతా ధనియాలు వేసి నానబెట్టిన నీటిని తెల్లవారాక తాగటం వలన ఉపయోగం ఉంటుంది.
- ఇవి రోగనిరోధక వ్యవస్థని శక్తిమంతం చేస్తాయి. అలాగే వీటిలో సూక్ష్మ జీవులపై పోరాడే శక్తి ఉండటం వలన అమ్మవారు పోసినప్పుడు కలిగే నొప్పి, దురదని తగ్గించే శక్తి ధనియాలకు ఉంది.
- ధనియాలు రక్తలేమిని తగ్గిస్తాయి. ఐరన్ లోపం వలన రక్తలేమి కలుగుతుంది. దాంతో గుండెదడ, ఆయాసం, అలసట, మెదడు శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలూ ఎదురుకావచ్చు. రక్తలేమి తగ్గాలంటే వీలయినంత తరచుగా ధనియాల టీని తాగుతుంటే మంచిది.