Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణంగా పండ్లను తిని తొక్కను పారేస్తుంటాం. కానీ పండ్ల పైనుండే తొక్కలతోనూ ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా ఆరెంజ్ తొక్కలు అందాన్ని పెంచడంలో తోడ్ప డుతాయి. వీటిని బయట పడేయడం కన్నా.. ఎర్రటి ఎండలో బాగా ఆరబెట్టి.. పొడికొట్టుకుని.. ఆ ఎండు చెక్కల పౌడర్‌తో.. ఎంచక్కా ఫేస్‌ప్యాక్‌లు వేసుకోండి..
- ఆరెంజ్ తొక్కల్ని ఎండలో బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి.. దీన్ని గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టుకుని నాలుగైదు నెలలు వాడుకోవచ్చు. ముఖా నికి ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
- ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్క పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల పెరుగును మిక్స్ చేసి ముఖానికి వేసుకుని... ఇరవై నిమిషాలయ్యాక శుభ్రం చేసుకోవచ్చు.
ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పౌడర్, కాస్త పసుపు, ఒక టేబుల్ స్పూన్ తేనే కలిపి పేస్ట్‌లాగ చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పూస్తే చక్కటి ఫలితం కని పిస్తుంది. పది నిమిషాల తర్వాత ఫేస్‌క్లీనర్ లేదంటే రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
- ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ గంధం చెక్కల పౌడర్, మరో స్పూన్ వాల్నట్ పౌడర్ కలపాలి. అందులోకి రెండు మూడు చుక్కల నిమ్మరసం, రెండు స్పూన్ల రోజ్ వాటర్‌లతో కలిపి మిక్స్ చేయాలి. దీన్ని తరచూ వాడితే ముఖ సౌందర్యం పెరుగుతుంది.
- ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపితే పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్ జిడ్డును తొల గించి.. అతు క్కున్న ధూళికణాలను వదల గొడు తుంది. బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ సమస్య కూడా తగ్గుతుంది.