Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీట్రూట్: తరచూ నీరసంగా అనిపిస్తుంటే బీట్రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి. రెండు, మూడు రోజులకొకసారి గ్లాసుడు బీట్రూట్ జ్యూస్ తాగితే చాలు కొన్ని రోజుల్లోనే సమస్య నుంచి బయటపడొచ్చు. దీనిని తాగడం వల్ల శరీరానికి కావల్సిన చక్కెర సమపాళ్లలో అంది నీరసం దరిచేరదు. దీన్నుంచి విటమిన్ బి, సి పుష్కలంగా అందుతాయి. రక్తపోటుకూడా అదుపులో ఉంటుంది
కాకర: దీని పేరు చెబితే చేదు అని దూరంగా జరిగేవాళ్లే ఎక్కువ. ఇందులో షుగర్ ఉండదు. కనుక మధుమేహులకూ ఇది చాలా మంచిది.
పుచ్చకాయ: రోజులో మనిషికి కావాల్సిన ఖనిజాలు, ఇతర పోషకాలూ, ఉప్పూ... ఒక గ్లాసుడు పుచ్చకాయ రసం తాగితే చాలు అందుతాయి. డీహైడ్రేషన్ సమస్యా దరిచేరకుండా కాపాడుతుంది. అదిశరీరం లో ఉన్న వ్యర్థపదార్థాలనూ బయటికి పంపిస్తుంది. దీనిని ఎంత తాగినా కొంచెం కూడా బరువు పెరగరు.
క్యారెట్: విటమిన్ 'ఎ' సమృద్ధిగా ఉండే కూర గాయ ఇది. చర్మ సమస్యలూ, కండ్ల సమస్యలూ ఉన్నవారు క్యారెట్ జ్యూస్ తాగితే చాలు... చర్మం మిలమిల మెరిసిపోతుంది.