Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లం: గ్యాస్ సమస్యకు మంచి మందు అల్లం. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. తిన్నగా నమలలేకపోతే చక్కెర కలుపుకుని తినొచ్చు.
వెల్లుల్లి: గ్యాస్ సమస్యకు వెల్లుల్లి చాలా చక్కటి సహజసిద్ధమైన మందు. దీనిని తిన్నగా నమలాలి. లేదా వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర విత్తనాలు, జీలకర్ర గింజలు తీసుకుని ఐదు నిమిషాల పాటు నీళ్లలో ఉడికించాలి. ఈ ద్రావణాన్ని తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు
దాల్చిన చెక్క: దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూస్‌ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య పోతుంది.
కొబ్బరి నీళ్లు: గ్యాస్ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు మంచిమందు. ఇందులో అసాధారణ ప్రోటీన్లు ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
కొత్తిమీర: అజీర్తి నిర్మూలనకు కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒక గ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
నిమ్మరసం: గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మరసం ఎంతో మేలు. ఒక కప్పు ఉప్పులో నిమ్మరసం, అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి తాగాలి. ఈ రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది.