Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా సుఖాసనం, వజ్రాసనం, పద్మాసనం, అర్థపద్మాసనంలో కూర్చోవాలి. రెండు చేతులను బిన్ ముద్రలో తొడలపై పెట్టాలి. కండ్లు మూసుకొని శ్వాసపైన ధ్యాస ఉంచుటూ, నాలుకను బయటకు చాపి గొట్టంలా చేసి నాలుక ద్వారా దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా నాలుకను లోపలికి తీసుకొని పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాసని బయటకు వలదాలి. ఈ విధంగా పదిసార్లు చేయాలి.
ఉపయోగాలు..
కోపం తగ్గుతుంది
నిద్రబాగా వస్తుంది
బిపీ కంట్రోల్లో ఉంటుంది
శరీరానికి చల్లదనం ఇస్తుంది
జాగ్రత్తలు..
జలుబు ఉన్నవారు చేయవద్దు
లోబిపీ సమస్య ఉన్నవారు ఈ ఆసనం సాధన చేయవద్దు
మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ ఆసనం వేయవద్దు.