Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల్లో మేధోపరమైన సృజనాత్మకత, చురుకుదనం పెరగాలంటే చిన్నతనంలోనే పునాది వుండాలి. చిన్న వయసులో మెదడు అతి వేగంగా కొత్త వస్తువులను, అంశాలను గురించి తెలుసుకోవటమే కాక, వాటిని రికార్డ్ చేసుకుంటుంది. అయిదు లేక ఆరు సంవత్సరాల లోపుగా పిల్లలు ఎక్కువ విషయాలను గురించి తెలుసుకుంటే వారి మేధస్సు అంతగా వికసిస్తుంది.
- ఊహా శక్తి పెరగటానికి గాను పిల్లలకు కధలు చెప్పాలి. సాధారణంగా పిల్లలకు కధను మించిన సాధనం లేదు. కధలే పిల్లలకు ప్రపంచం అంటే ఏమిటో తెలియజేస్తాయి. రోజులో జరిగే చర్యలను కధలద్వారా వివరించండి. పిల్లల ఆసక్తిని నిర్మాణాత్మకంగా మలచాలి. ప్రతి కథా ఆసక్తికరంగా చేయవచ్చు. అంతా చెప్పిన తరువాత కథ ముగింపు ఆలోచించి వారినే చెప్పమనాలి. అపుడు వారిలో ఊహా శక్తి పెరుగుతుంది. ముగింపులకు కూడా ప్రత్యామ్నాయాలు సూచించమనాలి.
- వాతావరణం బాగున్నప్పుడు ప్రతీ సాయంకాలం లేదా ఆరున్నర - ఏడు లోపుగా పిల్లలను బయటకు తీసుకువెళ్ళటం వల్ల బయట కనబడే జంతువులు, వస్తువులు, మనుషులను చూసి అర్థం చేసుకోవవటానికి
- చిన్నారులు ప్రయత్నిస్తారు. ఇది వారి మెదడులో కొత్త విషయాలను నేర్చుకునే విధానాన్ని పెంచుతుంది.
- పిల్లలకి సవాలక్ష సందేహాలు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి. వాళ్ల ప్రశ్నలు అడుగుతుంటే కోప్పడకుండా జవాబులు చెబుతూ ప్రోత్సహించండి. ప్రశ్నలడిగేందుకు ఉత్సుకత చూపిస్తే... అది సృజనాత్మకతకు దారి చూపుతుంది. వీలైనంత ఎక్కువ సమయం పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయించండి. పిల్లలతో మీరూ పిల్లల్లానే కలిసిపోయి ఆడండి. దీనివల్ల వాళ్లు మీతో బంధాన్ని ఏర్పరచుకుంటారు. కొత్తగా ఉండి, కల్పనాశక్తిని అందించే ఆటల్ని ఆడేలా ప్రోత్సహించండి. తల్లిదండ్రులతో ఎక్కువ సేపు గడిపే పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందన్నది అధ్యయనాల సారాంశం.
- వెన్నెల రాత్రిలో పిల్లల్ని వెంటపెట్టుకుని కాసేపు అలా నడవండి. వాళ్లకు ఇష్టమైన పుస్తకాన్ని అందరూ కలిసి కూర్చుని ఆస్వాదించండి. కనీసం వాళ్లకు ఇష్టమైన వంటకాన్నయినా అందరూ కలిసి కూర్చుని తినండి. అన్నింటికీ మించి జీవితం అంటే చదువులు, ఉద్యోగాలు చేయడం, తినడం, నిద్రపోవడమే కాదు జీవితాన్ని మాధుర్యంతో నింపుకునేందుకు మరెన్నో మార్గాలు ఉన్నాయనే విషయం చిన్నారులకు తెలిసేలా చేయండి!