Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వయసు పైబడుతున్న కొద్దీ ముఖంలో చాలా మార్పులు వస్తుంటాయి. కళ్ల కింద నల్లటి చారలు, వలయాలు ముఖ్యంగా వేధిస్తాయి. ఇవి కనిపించకుండా ఉండాలంటే...
- ముఖం మీద మచ్చలు ఉన్నప్పుడు ద్రవ రూపంలో ఉన్న ఫౌండేషన్‌ని ఎంచుకోవాలి. కళ్లకు మేకప్ వేసుకునే ముందు ఐస్ ముక్కని ఒక శుభ్రమైన వస్త్రంలో ఉంచి కళ్ల కింద రాయాలి. దీంతో కళ్లు ఉబ్బినట్టుగా కాకుండా తాజాగా కనిపిస్తాయి. ఇక కళ్ల కింద వలయాలు కనిపించకుండా ఉండాలంటే ముందుగా కొద్దిగా ఐక్రీమ్ రాయండి. ఆ తర్వాత కన్సీలర్ని కళ్ల కింద అక్కడక్కడా చుక్కల్లాగా పెట్టి వేలితో మ దువుగా అంతటా పరచాలి.
- భుజాల మీద స్ట్రెచ్ మార్క్స్ చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి కనపడకుండా ఉండేందుకు ముందుగా సమస్య ఉన్న చోట మాయిశ్చరైజర్ రాయాలి. తర్వాత ద్రవరూపంలో ఉండే ఫౌండేషన్ క్రీం రాస్తే సరి. అయినా ఆ తర్వాత కూడా అవి కనిపిస్తూ ఉంటే కన్సీలర్ని చేతితో అద్ది తేలిగ్గా పరుచుకునేలా చేయాలి.
- మూతి చుట్టు పిగ్మెం టేషన్ ఎక్కువగా వేధించే సమస్య. ఇక్కడా మేకప్ వేసే ముందు మాయిశ్చరైజర్ రాయాలి. తర్వాత కన్సీలర్తో చుక్కలు పెట్టి అంతటా పరచాలి. పిగ్మెంటేషన్ కోసం అండర్ ఐ క్రీం చక్కటి పరిష్కారం. ఈ క్రీం రాసిన తర్వాత ద్రవ రూపంలో ఉండే ఫౌండేషన్‌ని బ్రష్ సాయంతో రాయాలి. చివర్లో మందంగా ఉండే పౌడర్ని రాస్తే సరిపోతుంది.
- ముఖం మీద తెరుచుకున్న రంధ్రాలు కనిపించకుండా మేకప్ వేసే ముందు గ్రంథులు శుభ్రం చేసే పూతలు రాయాలి. దానికి బదులు ఐస్‌ముక్కలతో శుభ్రం చేసినా సరిపోతుంది. ఆ తర్వాత వీటిపై ద్రవ రూపంలో ఉండే ఫౌండేషన్ రాసి దానిపైన కొద్దిగా పౌడర్ అద్దుకోవాలి.