Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆహారం: రోజూ తీసుకునే ఆహారంలో పోష కాలు సమతూకంలో ఉండాలి. నార్మల్ హెయిర్ గలవారు చేపలు, చికెన్, పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. పొడి జుట్టు గలవారు పచ్చికూరగాయలు, ముడిబియ్యంతో వండిన అన్నం, అరటి పండ్లు, నట్స్, విటమిన్ 'ఇ' క్యాప్యుల్స్ తప్పనిసరి. జుట్టు జిడ్డుగా ఉండేవారు తాజా ఆకుకూరలు-కూరగాయలతో చేసిన సలాడ్స్, పండ్లు-పెరుగు తీసుకోవాలి.
షాంపూ: పొడి జుట్టు గలవారు మాడుపై ఉన్న సహజ నూనెలు పీల్చేయలేని షాంపూలను వాడాలి. షాంపూతో పాటు కండిషనర్ తప్పనిసరిగా వాడాలి. అప్పుడే వెంట్రుకలు ఎక్కువగా పొడిబారకుండా ఉంటాయి. జుట్టు జిడ్డుగా ఉండేవారు వారానికి మూడుసార్లు షాంపూతో తలస్నానం చేయాలి.
గుడ్డు: కోడిగుడ్డులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. మాయిశ్చరైజర్‌ని కోల్పోనివ్వవు. వారానికి ఒకసారి పొడిజుట్టుగలవారు గుడ్డులోని పసుపు సొనను, జిడ్డు గలవారు తెల్లసొనను ప్యాక్ వేసి 15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.
చుండ్రు నివారణకు: దుమ్ము, వాతావరణ, శుభ్రత లోపాలు చుండ్రుకు కారణం అవుతుంటాయి. 2 టీ స్పూన్ల బ్రౌన్ షుగర్‌లో టీ స్పూన్ హెయిర్ కండిషనర్ కలిపి మాడుకు పట్టించాలి. పదినిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే చుండ్రు తగ్గుతుంది.