Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురుగులు రానే రావు..
మీ కుండీలలో దాక్కునే లేదా మీ గార్డెన్లో ఉండే పురుగులను పారదోలటానికి మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఆ పని చేయవచ్చు. ఎలాగో చూద్దాం. ఒక ప్లాస్టిక్ కవర్లో ఆపిల్ జ్యూస్‌ను, వెనిగర్‌ను పోసి, ఆ కవర్‌కు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఒక గ్లాసులో ఉంచాలి.. ఎక్కడైతే పళ్లను తొలిచే పురుగులు కనబడతాయో అక్కడ ఈ గ్లాసులను ఉంచాలి. అవి ఆపిల్ వాసనకు అట్రాక్ట్ అయి గ్లాసు దగ్గరికి వచ్చి, గ్లాసులో ఇరుక్కుపోతాయి.
ఇలా చేస్తే గొంగళి మాయం..
వెనిగర్ గొంగళిపురుగుల నివారణకు మంచి మందుగా పనిచేస్తుంది. వెనిగర్‌ను స్ప్రే చేస్తే చాలు అవి మొక్కల దరిచేరవు. ఇంకొక రకంగా కూడా వీటిని నివారించవచ్చు. ఒక చిన్న పాత్ర తీసుకుని దానిలో 'బీరు'ను పోసి గార్డెన్ నేలలో గుంత తవ్వి.. అందులో పెట్టడం వల్ల నత్తలు పైకి వచ్చే సాహసం చేయవు.
గార్డెన్లో నీరు నిల్వ ఉండడం వల్ల గానీ, ఇతర కారణాల వల్ల గానీ దోమల బెడద ఎక్కువగా ఉండి గార్డెన్‌లోకి వెళ్లాలంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు సిట్రోనెల్లా క్యాండిల్‌తో దోమలను తరిమేయవచ్చు.
ఎలా చేయాలి..?
ఏం కావాలి: సోయా వ్యాక్స్, ఒత్తులు, సిట్రోనెల్లా ఆయిల్, కంటైనర్లు. వీటితో పాటు ఒత్తులను నిటారుగా ఉంచడానికి పెన్సిల్, పెన్, టేపు అవసరం.
తయారీ విధానం: సోయా వ్యాక్స్‌ను తగిన ఉష్ణోగ్రత వద్ద కరగబెట్టి, కంటైనర్‌లో పోయాలి. వ్యాక్స్ చల్లబడే సమయానికి ఒత్త్తులను అందులో నిటారుగా ఉంచాలి. దానికి పెన్సిల్ సహాయం తీసుకోవాలి. వ్యాక్స్ గట్టిపడిన తరువాత అది ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. వీటిని గార్డెన్లో ఉంచి వెలిగించినప్పుడు.. వాటి నుంచి వచ్చే వాసనకు దోమలు మాయమవడం ఖాయం.