Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాక్టీరియా అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. బ్యాక్టీరియా చేరే వస్తువులలో ప్రధానంగా..
అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరే వస్తువులలో హ్యాండ్ బ్యాగ్ ఒకటి. వీలైనంత వరకు ఆహారపదార్థాలను బ్యాగులోపల పెట్ట కుండా చూసుకోవడం మేలు. ఒకవేళ పెట్టాల్సి వచ్చినా ప్లాస్టిక్ కవర్లో ఉంచి అప్పుడు బ్యాగు లోఉంచాలి. వారానికి ఒకసారి తేమ లేకుండా బ్యాగుని గాలికి ఆరబెట్టాలి. ప్రతి పదిరోజుల కోసారి బ్రష్‌తో దులిపి లెదర్ కండిషనర్‌తో శుభ్రంచేయాలి.
- నిత్యం వాడే కీ బోర్డు, మౌస్, టీవీ రిమోట్, ఫ్రిజ్ హ్యాండిల్.. వంటి వాటిపై సూక్ష్మ క్రిములు సులభంగా చేరిపోతాయి. అలాంటప్పుడు వాటిని వాడి, ఆ చేతిని యథాలాపంగా నోటి దగ్గర పెట్టుకోవడం, ముఖానికి రాసుకోవడం తో అవి చర్మంలోనికి చేరతాయి. దాంతో మొటి మలు, ఇతర చర్మ ఆరోగ్య సమస్యలు ఎదుర వుతాయి. దీన్ని నివారిం చాలంటే ఆ వస్తువు లను ప్రతి వారానికి, పదిహేను రోజులకోసారి వెనిగర్‌లో ముంచిన దూదితో తుడవాలి.
- తాగే నీళ్ల సీసాలు శుభ్రంగా లేకపోతే శరీరానికి హానికలిగించే బ్యాక్టీరియా చేరిపోతుంది. అందుకే ప్రతి రెండురోజులకోసారి వేడినీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పు వేసి ఆ నీటితో సీసాలను శుభ్రం చేయాలి.