Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జలుబుకు మందులు వేసుకుంటే వారం.. వేసుకోకపోతే ఏడు రోజుల్లో జలుబు తగ్గుతుందని కామెడీగా చెప్పుకుంటాం. జలుబు కాస్తా ముదిరితే రకరకాల ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. అందుకే జలుబు చేసిన వెంటనే ఇంటి వైద్యం మొదలుపెట్టండి. చిన్ని చిన్ని చిట్కాలతో సర్దిని సాగనపండి.
- వేడినీటిలో యూకలిప్టస్ ఆయిల్ని వేసుకుని ఆవిరిపడితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
- జలబును తగ్గించడంలో తులసి బాగా పనిచేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్లఉప్పు కలిపి నమిలి ఆ రసాయనాన్ని మింగడం ద్వారా జలుబు తీవ్రత తగ్గుతుంది. తులసి టీ తాగినా జలుబు తగ్గుతుంది.
- రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చినచెక్క బాగా మరిగించి.. తర్వాత ఆ నీటిని వడగట్టి, దీనికి కొద్దిగా తేనె కలిపి తాగితే మంచిది.
- అల్లం ముక్కలను బాగా ఎండబెట్టి చూర్ణంలా చేసుకుని, దానికి కాస్త జీలకర్ర, పంచదార కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
- జిందా తిలిస్మాత్ జలుబుకు తక్షణ విరుగుడుగా పనిచేస్తుంది. ప్రతి రోజూ మూడు పూటలా మూడు చుక్కల జిందా తిలిస్మాత్ ఒక టేబుల్ స్పూన్ పాలు లేదా టీతో తీసుకుంటే జలుబు ఇట్టే తగ్గుతుంది.
- వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబు తగ్గుముఖం పడుతుంది.
- రాత్రి పడుకోబోయే ముందు పసుపు కలిపిన పాలు తాగితే పడశం బాధ తగ్గి సుఖనిద్ర పొందుతారు.
- జలుబు నుంచి రిలీఫ్ పొందినా.. దగ్గు మాత్రం అంత తొందరగా వదిలి పోదు. దగ్గును అరికట్టడంలో కరక్కాయ దివ్యౌషధంగా పని చేస్తుంది. కరక్కాయ ముక్కలను దవడ కింద ఉంచుకుని ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు తగ్గుతుంది.