Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాటుక పెట్టడంతో అమ్మాయిల కళ్ల అందం మరింత రెట్టింపవుతుంది. కళ్లు ఏ ఆకారంలో ఉన్నా కాటుక పెట్టగానే ఆకర్షణీయంగా కనబడతాయి. అయితే కళ్లు నలపడం, చెమట ఇతరత్రా కారణాల వల్ల కాటుక చెరిగిపోయి కంటి చుట్టూ నల్లగా తయారవుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కాటుక పెట్టుకునేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి.
- కాటుక పెట్టుకునే ముందు కాటన్ వస్త్రంతో కనురెప్పను శుభ్రంగా తుడుచుకోవాలి. కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగాపోయిన తరువాత మాత్రమే కాటుక పెట్టుకోవాలి.
- ఫేస్ పౌడర్ వాడడం ద్వారా కూడా కాటుక చెరిగిపోకుండా చేయవచ్చు. కళ్ల చుట్టూ కొద్దిగా ఫేస్ పౌడర్ రాసుకోవాలి. అక్కడి చర్మంపై ఉండే జిడ్డుని పౌడర్ పీల్చుకోవడం వల్ల కళ్లు చాలా తాజాగా ఉంటాయి.
- ఏ రకమైన మేకప్ వేసుకోవాలనుకున్నా ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై, కళ్లపై ఏమాత్రం తడిలేకుండా తుడుచుకోవాలి. తరువాతే కాటుక పెట్టుకోవాలి. మేకప్ వేసుకోవాలి.
- మీ చర్మానికి ఎక్కువగా చెమట పట్టే గుణముంటే ఐస్ ముక్కలతో ముఖాన్ని మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట పట్టడం తగ్గుతుంది. తద్వారా కాటుక కూడా చెదరకుండా ఉంటుంది.
- కనురెప్పల చివర భాగంలో కాటుకను పెట్టుకోవడం వల్ల చెరిగిపోయే అవకాశం ఎక్కువ. అందుకని కనురెప్పల మధ్యభాగంలో మాత్రమే కాటుక పెట్టుకోవాలి.
- కాటుక పెట్టుకునే ముందు కళ్లకి లైట్ కలర్ ఐషాడోని బేస్‌గా వేసుకోవాలి. ఆ తరువాత కాటుక పెట్టుకోవాలి. కళ్ల చుట్టూ కాటుక చెదిరిపోకుండా చూసుకోవడానికి ఇదొక సులభమైన మార్గం.
ఎమందంగా, చక్కగాపడే సన్నని కాటుక పెన్సిల్ని ఎంచుకోవడం ద్వారా కూడా కాటుక చెరిగిపోకుండా చూసుకోవచ్చు.