Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాయసంలో కిస్మిస్లు వేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. అంతేకాదు వీటిల్లో ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు ఎన్నో ఉన్నాయి.
వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. మితంగా తీసుకుంటే శరీరానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. కిస్మిస్ వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. వెంట్రుకలు రాలిపోవడాన్ని ఇవి అరికడుతాయి.
కిస్మిస్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువ. కాపర్, విటమిన్-బి పాళ్లు కూడా అధికంగానే ఉంటాయి. రక్తకణాల అభివద్ధిలో ఇవి దోహదం చేస్తాయి. అనీమియా వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. గాయాలు అయినపుడు రక్తం త్వరగా గడ్డకడుతుంది. గాయాలు కూడా త్వరగా మానిపోతాయి.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను దరి చేరనీయవు. కళ్లకు మేలు చేసే విటమిన్-ఎ పాళ్లు కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది.
దంతాల సమస్యలకు, చిగుళ్ల దఢత్వానికి కూడా అవసరమయ్యే పోషకాలు కిస్మిస్లలో సమద్ధిగా లభిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకల్లో పటుత్వానికి దోహదం చేస్తుంది.
ఇన్ని రకాలుగా మేనికి మేలు చేసే కిస్మిస్లను మిస్ కాకండి.
ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే గ్లూకోజ్ శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. కొలెస్టాల్ర్ బాధలేకుండా బాడీవెయిట్ పెంచుతాయి. బక్కపల్చగా ఉన్నవారు కాస్త ఒళ్లు చేయడానికి ఎండుద్రాక్ష తీసుకోవడం మంచిది.