Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకుపచ్చ బటాణీని కూరల్లో, రైస్ ఐటమ్స్‌లో ఎలా వాడినా వాటి రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పచ్చి బటాణీలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే వాటిని రుచి కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా, మన ఆహరంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మంచి పోషకాలు వున్నాయి.
- వీటిలో న్యూట్రియంట్లు, విటమిన్లు, యాంటిఆక్సిడెంట్లు సంమద్ధిగా ఉంటాయి. బీన్స్‌తో పోలిస్తే కాలరీలు కూడా తక్కువ. వంద గ్రాముల బటాణీలలో కేవలం 81 కాలరీలు మాత్రమే ఉంటాయి. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
- ఇక గర్భిణీ స్త్రీలు బటాణీని తరుచూ ఆహారంలో చేర్చుకోవటం ఏంతో మంచిది. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్ విటమిన్లు, అధికంగా వీటిలో ఉంటాయి. అవి కడుపులోని బిడ్డ ఎదుగుదలకి ఎంతో మేలు చేస్తాయి.
- బటాణీని ఆహారంలో చేర్చుకోవటం ద్వారా ''సి '' విటమిన్ లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
- ఈ బటాణీల ద్వారా విటమిన్ కె, ఎ కూడా లభిస్తాయి. ఎముకుల సాంద్రతని పెంచి, మెదడు పనితీరుని మెరుగు పరుస్తాయి ఆ విటమిన్లు. కంటి చూపు చక్కగా ఉండేలా చూస్తాయి.
- వీలు అయినంత వరకు ఏదో ఒక రూపంలో పచ్చి బటాణిని ఆహారంలో చేర్చుకోవటానికి ప్రయ త్నించాలి. అన్ని రైస్ ఐటమ్స్‌లో ఓ గుప్పెడు బటాణీలని వేయటం, కూరలలో చేర్చటం వంటివి వాటి వినియోగాన్ని పెంచుతాయి. పిల్లలకి ఉడికించి చాట్ చేసి కూడా పెట్టవచ్చు. ఆలు-బటాణి, కాబేజీ-బటాణీ, ఇలా రకరకాల కాంబినేషన్లో ట్రై చేయచ్చు.