Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మృదువైన ఆరోగ్యంగా ఉండే చర్మం కోసం కొన్ని రకాల పోషకాలు శరీరానికి అందాల్సిందే. అవేంటో చూడండి.
క్యారెట్: విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లకీ, చర్మానికీ మేలు చేస్తుంది. చర్మం మీద ఇన్ఫెక్షన్ల ప్రభావం పడకుండా చూస్తుంది. చర్మ క్యాన్సర్ కారకాలతో పోరాడి ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
ఎర్ర క్యాప్సికం: దీన్లో కెరొటినాయిడ్లు సమృద్ధి గా లభిస్తాయి. ఇవి చర్మానికెంతో మేలుచేస్తాయి. రక్తప్రసరణ సక్రమంగా ఉండటానికి తోడ్పడు తాయి. ముడతలు కూడా క్రమంగా దూరమ వుతాయి. దీంతో చర్మం చక్కని ఛాయతో మెరిసిపోతుంది.
డార్క్ చాక్లెట్: యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఫ్యాటీ ఆమ్లాలు, ఫ్లవనాయిడ్లు అధికం. ఇవి చర్మం మృదువుగా ఉండ టానికి తోడ్పడుతాయి. మృతకణాలు కూడా తొలగిపోతాయి.
పాలకూర: ఇనుము, విటమిన్లు, మెగ్నీషియం, విటమిన్ ఎ, పీచూ, ప్రోటీన్లూ అధికంగా లభిస్తాయి. శరీరంలోని వ్యర్థా లను బయటకు పంపి చర్మానికి మేలు చేస్తాయి.
గ్రీన్ టీ: దీన్లో అమినో ఆమ్లాలూ, యాంటీ ఆక్సి డెంట్లూ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మం మీద వాపులూ, ముడతలు, దద్దుర్లు, యాక్నే సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది.
ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు: ఇవి శరీరానికి అందితే ముడతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. చర్మానికి తేమ అంది తాజాగా కనిపిస్తుంది. ఈ ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అందడం వల్ల ఒత్తిడీ, కుంగుబాటు వంటివీ తగ్గుతాయి. చేపలు, సోయా గింజల్లో ఈ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా దొరుకుతాయి.
బొప్పాయి: విటమిన్ సి, ఇ, బీటాకెరొటిన్ అధికం. ఇవన్నీ చర్మకణాలను పునరుద్ధరింపచేస్తాయి. చర్మం మీది మృతకణాలను తొలగిస్తాయి.