Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రి ఆలస్యంగా నిద్ర పోవడం, పొద్దున లేవలేక ఇబ్బందిపడటం చాలామందికి అలవాటే. అలా నిద్రలేచినప్పుడు రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉదయం లేచినప్పట్నుంచీ ఉత్సాహం సొంతమవ్వాలంటే.. ఈ టిప్స్ పాటించి చూడండి.
- ఎప్పటి పనులపుడు పూర్తి చేసుకుంటే ఒత్తిడి ఉండదు. అందుకే రాత్రే పనులన్నీ పూర్తి చేసి పడుకోవాలి. వీలైనంత వరకూ మర్నాటికి అవసరమైనవన్నీ సిద్ధం చేసిపెట్టుకుంటే కంగారూ, ఆందోళనా ఉండవు. మర్నాడు హాయిగా నిద్రలేవొచ్చు. పనులూ చకచకా పూర్తవుతాయి.
- ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం అనేది ఆరోగ్యాని కెంతో మేలు చేస్తుంది. దీనివల్ల జీవక్రియల రేటు మెరుగవు తుంది. ఈ ప్రక్రియని కొనసాగించాలంటే సెలవు రోజు ఉదయాన్నే లేవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అలారంతో పనిలేకుండా పొద్దున్నే, ఆ సమయం కాగానే మనకే మెలకువ వచ్చేస్తుంది. మత్తుగా, బద్ధకంగా ఉండదు.
- ఒకవేళ నిద్రలేచేప్పుడు అలారం పెట్టుకోవాల్సి వస్తే మనసుకు హాయిగా అనిపించే మెలోడీ ట్యూన్లను ఎంచుకోవాలి. రణగొణ ధ్వనులతో ఉండేవి పెట్టుకోవడం వల్ల ఆ సమయంలో తెలియని ఆందోళన ఆవహిస్తుంది. అలాగే తక్కువ శబ్దం వచ్చేలా చూసుకోవాలి. దీనివల్ల పక్కవారికి ఇబ్బందిగా ఉండదు.
- నిద్రలేవగానే బద్దకం, మత్తుగా అనిపిస్తే దాన్ని వెంటనే వదిలించుకోవాలి. లేదంటే ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఉదయం పూట సూర్యరశ్మి తగిలితే శరీరానికి నూతనోత్తేజం అందుతుంది, అసౌకర్యం దూరమవుతుంది. ఎండలో ఉండే 'డి' విటమిన్ ఒత్తిళ్లనూ దూరం చేస్తుంది.
- ఎండ తగిలే అవకాశం లేని పక్షంలో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి ధ్యానం, పుస్తకాలు చదవడం వంటి ఏదో ఒక వ్యాపకం మీద దృష్టిపెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. గ్రీన్ టీనో, కాఫీనో తాగితే ఉత్సాహం వస్తుంది. అలానే ఉదయం పూట ఇల్లంతా పరిమళభరితంగా ఉం డటం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది.