Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటిలో మనతో పాటుగా ఎన్నో రకాల క్రిమి, కీటకాలు నివాసం ఉంటాయన్నది యదార్థం. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి బొద్దింకలు. ఇవి బాత్రూమ్లో, కిచెన్‌లో కనిపిస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. అంతేకాదు వీటి నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాయి.
పరిసరాలను శుభ్రంగా ఉంచడం
- పరిసరాల పరిశుభ్రత ప్రథమ నియమం. ఏ రకమైన క్రిమి కీటకాలు కూడా ఇంట్లో చేరకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి పాటించాల్సిందే.
- ముఖ్యంగా ఎక్కడైతే వంట, భోజనాలు చేస్తారో అక్కడ శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే మిగిలిపోయిన ఆహారాలపైకి ఇవి తొందరగా చేరుతాయి. భోజనం చేసే ప్రదేశాల్లో, వంట చేసిన తర్వాత మీ స్టవ్ దగ్గర వెంటనే శుభ్రపరచడం తప్పనిసరి.
సింక్‌లో పాత్రలు నిల్వ లేకుండా ఉండటం
చాల వరకు ఉదయం వంట పాత్రలను సాయంత్రం, రాత్రి వాటిని మరు ఉదయం కడగడం అలవాటు. కాని ఇలా ఇవి సింక్ లో ఉన్నంత వరకు బొద్దిం కలకు, ఇతర క్రిమి కీటకాలకు కావాల్సిన ఆహారాన్ని సమకూరుస్తున్నా రన్నమాట. అందుకే వాటిని ఎప్పటి కప్పుడు శుభ్రం చేయాలి. ఒకవేల అలాగే ఉంచాల్సివస్తే సబ్బు నీళ్లను అన్ని పాత్రలపై చల్లడం మర్చిపోవద్దు.
చెత్తను నిలువ ఉంచవద్దు
చెత్త, ముఖ్యంగా ఆర్గానిక్ వేస్ట్ క్రిమి కీటకాలకు అడ్డ. అందుకే దీన్ని వెంట వెంటనే తీసివేయండి. మీ కిచెన్ లో ఉండే గార్బేజ్ డబ్బా కూడా మూత ఉన్నదాన్నివాడండి. క్లీనింగ్ పరికరాలను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండండి. ముఖ్యంగా మిగిలిపోయిన ఫుడ్ పదార్థాలు ఎక్కడ లేకుండా చూడండి.
ఆహార పదార్థాలను సరిగా భద్రపరచడం
ఆహార పదార్థాలను అలగే ఓవెన్‌ను వాడిన తరువాత అలాగే వదిలెయ్యకుండా కంటైనర్‌లో గాని లేదా వేరేరకంగా ప్రాపర్‌గా సీల్ చేయడం తప్పనిసరి. పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు లేదా ధాన్యాలు ఏవైనప్పటికీ కంటైనర్లలో దాచి పెట్టడం సరైన పద్ధతి .
- ఇంకా కిచెన్‌లోకి గాలి, వెలుతురు సరిగాపడేలా చూడడం, సింక్ కింద, వంట గది మూలలలో తరచూ శుభ్రం చేయడం వలన బొద్దింకలకు దూరంగా ఉండవచ్చు.
బొద్దింకలను దూరంగా ఉంచే కొన్ని చిట్కాలు
- బొద్దింకలు రాకుండా ఉండాలంటే.. దోస కాయ ముక్కలను ఎండబెట్టి కప్‌బోర్డుల్లో, అల్మారా లోనూ ఉంచితే చాలు. లేదా దోసకాయ తొక్క తీసి బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో స్టిక్ చేసినా సరిపోతుంది.
- బేకింగ్ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదే శంలో చల్లాలి. దీనివల్ల కచ్చితంగా బొద్దింకలు ఉండవు.
- బొద్దింకలు తిరిగే ప్రదేశంలో బిర్యానీ ఆకులను పౌడర్ చేసి చల్లడం వల్ల ఆ వాసనకే అవి చచ్చిపోతాయి.
- సోప్వాటర్లో బొద్దింకలు చాలా సమయం ఉండలేవు. కాబట్టి కొద్దిగా నీళ్ళల్లో సోపు వేసి బాగా కలపాలి. ఈ నీళ్ళను బొద్దింకల మీద చల్లడం వల్ల క్షణాల్లో చనిపోతాయి.
- బకెట్ నీళ్ళలో అమ్మోనియం కలిపి కిచెన్ సింక్, వాష్ బేసిన్, బాత్రూమ్లో పోయాలి. ఈ నీళ్ల మిశ్రమం బొద్దింకలను చాలా చిరాకు పెడుతుంది.
- గోధుమపిండిలో బోరిక్‌పౌడర్, చక్కెర వేసి కొన్ని నీళ్లు పోసి ఉండలుగా చేసు కోవాలి. వీటిని గదుల మూలల్లో పెడితే బొద్దింకలు మాయమవుతాయి.