Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో కిడ్నాప్‌ల సంఖ్య పెరిగిపోతుంది. బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వచ్చేవరకు కుటుంబసభ్యులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మాయిలు ఆత్మరక్షణ టెక్నిక్స్ తెలుసుకుంటే తమను తాము రక్షించుకోవచ్చు. ఈ రోజు ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలో తెలుసుకుందాం..!
స్టెప్ 1
అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఆమె నోటిని మూస్తూ గట్టిగా పట్టుకుంటాడు.
స్టెప్ 2
అమ్మాయి తలతో ఆ వ్యక్తి ముఖాన్ని గట్టిగా కొట్టి, అతని చేతిని ఆమె కుడిచేతితో బలంగా మెలితిప్పింది.
మెలితిప్పిన చేతిని అలాగే గట్టిగా పట్టుకుని అతని కడుపులో సైడ్‌కిక్ చేసింది. దాంతో అతను బ్యాలెన్స్ తప్పిపోతాడు.
స్టెప్ 3
రెండోవ్యక్తి ముందుకు వస్తూ అమ్మాయిని పటుటకునేందుకు తన కుడిచేతిని ముందుకు తీసుకువస్తాడు.
ఆ చెయ్యిని అలాగే గట్టిగా పట్టుకుని ఎల్బో దగ్గర వెనక్కి వంచాలి. వెనుక నుంచి పట్టుకోవడానికి వస్తున్న మొదటివ్యక్తిని ఎడమకాలితో గట్టిగా అతని మెడవద్ద తాకేలా కిక్ చేయాలి. అతను కింద పడిపోతాడు.
స్టెప్ 4
అరచేతిని నైఫ్‌లా చాచి ముందున్న వ్యక్తి కడుపు లో గట్టిగా పంచ్ ఇవ్వాలి. దాంతో రెండో వ్యక్తి కిందపడిపోతాడు. అక్కడి నుంచి తప్పించుకోవచ్చు.