Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెదవులు ఎంత అందంగా ఉంటే ముఖం అంత అందంగా ఉంటుంది. అయితే కాలుష్యం వల్లనో లేక విటమిన్ల లోపం వల్లనో పెదవులు పొడిబారిపోయి, నల్లబడిపోతుంటాయి. మళ్లీ వాటిని మదువుగా మార్చడం మన చేతిలో పని. అందుకే ఈ చిట్కాలు పాటించి చూడండి..
- ఒక టీ స్పూన్ బాదం ఆయిల్, సమంగా నిమ్మరసం కలిపి పెదాలపై రాసి పూర్తిగా ఆరిపోయే వరకూ ఉంచి నీటితో కడగాలి. ఇది పెదాలపై ఉన్న మురికిని నల్లని పొరలను
శుభ్రపరచి అందంగా తీర్చిదిద్దుతుంది.
- బీట్ రూట్ రసం తీసి, అందులో కొద్దిగా పాల మీగడను కలపండి. ఈ మిశ్రమంతో పెదవులను మదువుగా మర్దనా చేయండి. వారానికి రెండు మూడుసార్లయినా ఇలా చేస్తే పెదవులు మంచి రంగులో ఉంటాయి. టొమాటో గుజ్జులో పాల క్రీమ్ కలిపి రాసుకున్నా మంచిదే.
- కొన్ని గులాబీ రేకులు, కొద్దిగా పాలు కలిపి మెత్తని పేస్లా చేయండి. ఈ మిశ్రమంతో రాత్రి పడుకోబోయే ముందు పెదవులకు ప్యాక్ వేసుకుని, ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. రోజూ ఇలా చేస్తే ఒకట్రెండు వారాల్లోనే మార్పు కనిపిస్తుంది.
- పుదీనా రసంలో రోజ్ వాటర్ కలిపి పెదవుల్ని తరచూ రుద్దుకుంటూ ఉంటే నలుపు మాయమవుతుంది
- వెన్నలో పంచదార కలిపి పెదవుల్ని రుద్దుకుంటే పెదవులపై ఉండే మతకణాలు తొలగిపోతాయి. తద్వారా నలుపు కూడా తగ్గి పెదాలు మెరుస్తాయి
- పసుపులో కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయండి. దీనిని పెదవులపై రాయండి. తరువాత ఒక మెత్తని బట్ట తీసుకుని సుతిమెత్తగా రుద్దండి. అప్పుడప్పుడూ ఇలా చేయడం వల్ల నల్లదనం మాయమై అధరాల అందం మరింత ఇనుమడిస్తుంది.