Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు పెరగకుండా ఉండాలన్నా తక్కువ కాలరీలున్న ఆహారాన్ని తీసుకోవాలి. తక్కువ కాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాన్ని తయారుచేసుకునేందుకు న్యూట్రిషనిస్టులు కొన్ని సూచనలు చేస్తున్నారు..అవి..
- స్మార్ట్ కుకింగ్ అలవాటు చేసుకోవాలి. మీ ఆహారాన్ని గ్రిల్ చేయటం, ఉడకబెట్టడం, బేక్ చేయటం చాలా మంచిది. నాన్‌స్టిక్ తవా, పాన్‌లో ఆహారాన్ని తయారు చేసుకోండి. అలాంటి ఆహారం తినటం వల్ల తక్కువ కాలరీలతో పాటు ఆరోగ్యం కూడా.
- కాలీఫ్లవర్, మిరియాలు, తోటకూరలు, బీరకాయల్లాంటి పదార్థాల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ప్రొటీన్ ఆహారాన్ని తీసుకుంటేనే సంతప్తిగా ఉంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చేపలు, చికెన్, సోయా లాంటివి తింటే బావుంటుంది.
- జొన్నలు, రాగులు, గోధుమలతో చేసిన రొట్టెలు తినాలి, ఓట్స్, బార్లీ, డ్రై ఫ్రూట్స్, అవిసె గింజల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మంచిది.
- వంటనూనెల్ని నెలకోసారి మారుస్తుండాలి. రైస్‌బ్రాన్, ఆవ నూనెల్ని వాడుతుండాలి.
- పండ్లు, కూరగాయల ముక్కలు ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. అన్నం, కూర దాదాపుగా సరిసమానంగా ఉండాలి. అంటే కూర ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.
- స్నాక్స్ టైంలో నూనెతో తయారైన సమోసాలు, బజ్జీల్లాంటి వాటికి దూరంగా ఉండాలి.
- టీలు, కాఫీలు తాగే వారు రోజులో ఒకటి రెండుసార్లకంటే ఎక్కువగా తాగకూడదు.