Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుడ్డు సొనతో
గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మార్చుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇందుకోసం గుడ్డులోని తెల్లసొన తీసుకుని దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి కొద్దిగా నురగ వచ్చేంత వరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖంపై రాసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ప్యాక్ ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమంలో వాడే నిమ్మరసం, గుడ్డుసొన... రెండూ సౌందర్య పోషణలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే వీటిని నేరుగా ఉపయోగించడం కంటే ఇలా రెండింటినీ కలిపి ముఖానికి పట్టించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పైగా మంచి ఫలితాలను కూడా పొందవచ్చు
దోసకాయ రసంతో
చర్మం బిగుతుగా మారాలంటే దోసకాయ రసాన్ని ఉపయోగించాల్సిందే. ఇది చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు బిగుతుగా, కాంతివంతంగా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందుకోసం... దోసకాయ పైతొక్కను తీసేసి, ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత వాటి నుంచి రసాన్ని తీసి కొద్దికొద్దిగా ముఖమంతా అప్లై చేసుకోవాలి. రసం పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్వల్ల మరో ఉపయోగం ఏంటంటే... ఈ రసాన్ని కంటి కింది చర్మం కూడా రాసుకోవచ్చు. ఫలితంగా కంటి అలసట తగ్గి నల్లటి వలయాలు, మడుతలు వంటివి మాయమవుతాయి.
తేనె, నిమ్మరసంతో
సౌందర్యాన్ని పెంపొందించడంలో తేనె ప్రముఖ పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు. అయితే చర్మాన్ని బిగుతుగా మార్చడంలోనూ ఇది సహకరిస్తుంది. మూడు చెంచాల తేనెకు, కొన్ని చుక్కల నిమ్మరసం, ఆలివ్ నూనెను కలిపి, ఆ మిశ్రమాన్ని మెడ, ముఖంపై రాసి ఆరిన తర్వాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే తేనెలో కొద్దిగా పసుపు, మీగడ కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత కడిగేసుకున్నా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.