Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చీరలు ఎన్ని రకాలుగా కట్టినా క్రేజ్ పోనే పోదు. రకరకాల రవికెలొచ్చాయి. ధోతీ, లంగాఓణీ వంటి రకరకాల చీరలొచ్చాయి. ఇప్పుడు కుచ్చిళ్ల వంతు. కుచ్చులు.. ప్రిల్స్... ఒకప్పుడు పిల్లల గౌన్లకు మాత్రమే ఉండేవి. తరువాత అమ్మాయిల డ్రెస్‌లకు వచ్చాయి. ఇప్పుడు చీరల మీదకు చేరాయి. చీరకొసన కుట్టే ఈ కుచ్చులనే... రఫ్ల్బార్డర్ అంటున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు రఫుల్ బార్డర్ చీరలే. కాటన్, నెట్, ఆర్గంజా, సిల్క్, జార్జెట్, షిఫాన్... ఫ్యాబ్రిక్‌తో సంబంధం లేకుండా అన్ని రకాల్లోనూ అమరిపోతున్న ప్రిల్స్ చీరల్లో మరింత అందంగా కనిపిస్తున్నారు. మీరూ ఓసారి ప్రయత్నించండి.