Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దినా ఓ దివ్య ఔషధం.. తరుచూ తింటే పలు రకాల జబ్బులను దూరం చేస్తుంది. నోటి దుర్వాసనను మటుమాయం చేసి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచుతుంది. మామూలు వంటలను సైతం తన సువాసనతో ఘుమఘుమ లాడించే పుదీనాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వంటల్లో వాడేందుకే కాకుండా, వివిధ రకాల జబ్బులను నివారించే దివ్య ఔషధంలా కూడా పనిచేస్తుంది.
- పుదీనా ఆకులు శరీరంలోని వివిధ రోగకారక క్రిములను నాశనంచేస్తాయని పరిశోధనల్లో తేలింది. దీని నుంచి తీసే మెంథాల్ను తల, గొంతు నొప్పి నివారణకు వాడుతున్నారు.
- పుదీనా ఆకులు కలిపిన నీటిని పుక్కిలించి ఉమ్మితే నోటి నుంచి వచ్చే దుర్వాసనను నివారించవచ్చు. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టిపడడమే కాక, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులూ దూరమవుతాయి.
- పుదీనా ఆకుల్లో ఉండే పీచుపదార్థాలు మాంస కత్తులను సైతం సులభంగా జీర్ణం చేసేందుకు దోహదపడతాయి.
- పుదీనా టీలో కొంచెం తేనె కలిపి తాగితే అర గని పదార్థాలు సులువుగా జీర్ణమవుతాయి.
- కడుపు నొప్పితో బాధపడుతున్నవారు మరి గించిన పాలలో పుదీనా ఆకులను వేసి పంచదార కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
- వేడివేడి పుదీనా టీ తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
- పుదీనా ఆకుల రసాన్ని రోజూ రెండు స్పూన్లు తేనెలో కలిపి పిల్లలకు తాగిస్తే కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోతాయి.
- షుగర్ వ్యాధిగ్రస్తులు పుదీనా ఆకులను ఆహారంలో అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది.