Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖంపై ఉండే మచ్చలతో పాటు ఇతర రకాల సమస్యల్ని పోగొట్టు కోవడానికి చాలామంది రకరకాల ఫేస్క్రీమ్స్ని ఆశ్రయిస్తారు. అయితే ముఖం మెరిసిపోవడానికి నిమ్మకాయ, బేకింగ్‌సోడాలో మంచి గుణాలు న్నాయి. వీటితో చేసే ఫేస్‌ప్యాక్స్ గురించి తెల్సుకుందాం.
వంటింట్లో ఉండే నిమ్మ, బేకింగ్ సోడా ఫేస్‌ప్యాక్స్ చేయటం సులువు. పైగా ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. నిమ్మరసంలోని సిట్రిక్ ఆసిడ్, విటమిన్-సి ముఖంమీద ఉండే జిడ్డును పోగొడుతుంది. ఫ్రెష్‌నెస్ ఇస్తుంది. బేకింగ్‌సోడా ముఖంపై ఉండే దుమ్మును శుభ్రపరస్తుంది. మతకణాల్ని తరిమేస్తుంది. ముఖానికి మెరుపునిస్తుంది. ఇక తేనెకు చెడు బాక్టీరియాని చంపే గుణం ఉంది. చర్మాన్ని మదువుగా చేస్తుంది. మొత్తానికి అతి తక్కువ ధరలోనే ముఖానికి మేలు చేయడంతో పాటు అందానికి దోహదపడే ఈ నిమ్మ, బేకింగ్‌సోడా ప్యాక్ తయారీ విధానమెలాగో తెల్సుకుందాం.
నిమ్మ, బేకింగ్‌సోడా ఫేస్‌ప్యాక్
ఒక కప్పులో 1 టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాని కలపాలి. ఈ మిశ్రమానికి 1 టీ స్పూన్ సహజమైన తేనెను కలపాలి. బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. మెడ దగ్గర కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పట్టించిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత చన్నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.