Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్లలపై ఆగడాలకు అంతులేకుండా పోతుంది. ఎలాగైనా వారిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నంతో ఆయుధాలతో దాడికి పాల్పడుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిపై కొడవలితో దాడి చేసినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఎదురుదాడి చేసిందో తెలుసుకుందాం.
స్టెప్ 1
ఒక వ్యక్తి కుడిచేతిలో కొడవలిని పట్టుకుని దాడి చేసినప్పుడు అమ్మాయి ఎడమచేతితో అతని చేయిని మణికట్టు వద్ద గట్టిగా పట్టుకుంది.
స్టెప్ 2
మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకుని చేయిని వడితిప్పింది. దాంతో నొప్పిని భరించలేక కొడవలిని కింద పడేస్తాడు.
స్టెప్ 3
అతని చేయిని అలాగే గట్టిగా పట్టుకుని ఆమె తన కుడిచేతితో అతని వీపుపై బలంగా పంచ్‌లు ఇచ్చింది. జట్టు పట్టుకుని వెనక్కి లాగింది.
స్టెప్ 4
జట్టుని అలాగే పట్టుకొని కుడికాలితో అతని ఎడమకాలిని లాక్ చేసి సైడ్‌కు కిక్ చేసింది. దాంతో బ్యాలెన్స్ తప్పి అతడు కింద పడిపోతాడు. అప్పుడు కుడిమోకాలిలో అతని ఛాతిపై కిక్ చేయాలి.
చావుతప్పి వళ్లంతా హునమైన అతడు మరే అమ్మాయిపై దాడికి ప్రయత్నించకుండా బుద్ధి చెప్పింది.