Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సులువుగా, విరివిగా దొరికే చెట్లలో వేపచెట్టు అగ్రస్థానం. ఈ చెట్టులో అన్నీ ఉపయోగకారకాలే. అందుకే వేపచెట్టును సర్వరోగ నివాణి అని కూడా పిలుస్తారు. ఈచెట్టు ఉపయోగాలేంటంటే...
- వేపాకు వాడటం వల్ల చర్మసంబంధ వ్యాధులు రావు. శరీరంపై పొక్కులు, మంటపుట్టడం ఉంటే వేపాకుతో చక్కటి ఉపశమనం లభిస్తుంది.
- వేపపుల్లతో పండ్లుతోమటం అనాదిగా వస్తున్న ఆచారం. భారతదేశంలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ పద్ధతి కనిపిస్తుంది. చేదు వేప పుల్లతో రోజు ఆరంభిస్తే తీపి ఫలితాలే.
- వేపాకు యాంటీ బ్యాక్టీరియల్. సబ్బుల్లో విరివిగా ఉపయోగిస్తారు. దీని వల్ల బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు శరీరానికి హానిచేయవు.వేపాకు ఫంగస్ నివారిణిగా పనిచేస్తుంది.
- వేపాకు తల్లోని చుండ్రుని తొలగిస్తుంది. వేపాకు పేస్టు జుట్టు కుదుళ్ళలోకి వెళ్ళి స్టాంగ్ హెయిర్‌తో పాటు జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది.
- అంతెందుకూ రోజూ రెండు లేదా మూడు వేపాకులు తినటం వల్ల కడుపులో హానికలిగించే సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి.
- దీని వ్లల గాయాలు, ఇన్ఫెక్షన్స్ నయమవుతాయి.
- చర్మం ఎర్రబడటం, ఇరిటేషన్, దురద ఉంటే వేపనూనె వాడితే సమూలంగా తగ్గిపోతాయి.
- వేపాకుతో మొటిమల్ని నిర్మూలించవచ్చు.
- వేపాకు చక్కటి గ్యాస్టో ప్రొటెక్టివ్‌గా పనిచేస్తుంది.
- వేపాకు, వేపకాయల్ని సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు. మొక్కల తెగుళ్ళని అంతమొందించి, మంచి పంటను తీయవచ్చు.
- రోగనిరోధకశక్తిని మెరుగుపరిచే అత్యద్భుతమైన ఔషధంగా వేపాకు పనిచేస్తుంది.